Begin typing your search above and press return to search.
పుట్టినరోజు లేని ఏపీ.. ఇక ఎప్పటికి ఇంతేనా?
By: Tupaki Desk | 20 Oct 2019 8:50 AM GMTఅదేం దరిద్రమో కానీ.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పగల సామర్థ్యం.. ప్రపంచ స్థాయిలో దేశ గౌరవాన్ని భారీగా పెంచటమే కాదు.. కీర్తి కిరీటాన్ని పెట్టేలా చేసిన చాలామంది ప్రముఖులకు కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో మేధావులకు.. తెలివైన వారికి కొదవలేదని చెబుతారు. తమకు మించిన చైతన్యం తెలుగోళ్లలో మరెవరికీ ఉందని తరచూ డప్పు కొట్టుకునే ఆంధ్రోళ్లకు.. అనూహ్యంగా ఇప్పటివరకూ రాష్ట్ర అవతరణ దినోత్సవం అన్నది లేకపోవటం విచిత్రంగా చెప్పాలి.
ఏ రాష్ట్రానికైనా ఆవతరణ దినోత్సవాన్ని ప్రముఖంగా జరుపుకుంటారు. రాష్ట్రం ముక్కలైన రోజునే.. రాష్ట్ర ఆవతరణగా వేడుక జరుపుకోవాల్సిన దుస్థితి ఏపీ ప్రజల సొంతం. ఇది మొదట్నించి ఉన్నదే. మొదట్లో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ మొత్తం తమిళనాడు అధీనంలో ఉండేది. అరవ రాష్ట్రంలో ముక్కగా ఉంటూ.. తెలుగోళ్లకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలని.. తెలుగోడి ఉనికి ప్రపంచానికి చాటాలన్న పట్టుదలతో పెద్ద ఎత్తున పోరాటం చేశారు. త్యాగమూర్తి పొట్టి శ్రీరాముల ఆత్మబలిదానంతో తమిళనాడు రాష్ట్రం నుంచి 1953 అక్టోబరు ఒకటిన బయటకు వచ్చి కొత్త రాష్ట్రంగా అవతరించింది.
ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పటికీ.. తర్వాతి కాలంలో తెలుగోళ్లంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని.. అలా ఉంటే.. తెలుగోళ్ల ఉనికి మరింత బలోపేతం అవుతుందన్న భావన తెర మీదకు వచ్చింది. ఇందులో భాగంగా పలు తర్జనభర్జనల అనంతరం 1956 నవంబరు 1న తెలంగాణలో విలీనమైంది. నాటి హైదరాబాద్ రాష్ట్రంలో కలిసిన నవంబరు ఒకటినే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకునే వారు.
అయితే.. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఏర్పడిన ఉమ్మడి ఏపీ మీద పలు అభ్యంతరాలు వ్యక్తం కావటం.. సుదీర్ఘకాలం పాటు సాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నేపథ్యంలో 2014 జూన్ 2న ఉమ్మడి ఏపీని రెండు రాష్ట్రాలుగా ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో.. తాము పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవంగా జూన్ 2ను నిర్వహిస్తున్నారు. అదే సమయంలో.. రాష్ట్ర విభజన జరిగిన రోజును తమ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా చేపట్టటంపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో విభజన గాయాన్ని రేపే జూన్ 2ను ఏపీ రాష్ట్ర ఆవతరణ దినోత్సవంగా జరుపుకోవాల్సి వస్తోంది. పొట్టిశ్రీరాములు ఆత్మ బలిదానంతో ఏపీగా మారిన ఆక్టోబరు 1న ఆంధ్రప్రదేశ్ ఆవతరణ దినోత్సవంగా చేసుకుంటే మంచిదన్నది కొందరు అభిప్రాయం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములు జన్మదినాన్ని ఏపీ రాష్ట్ర ఆవతరణగా చేయటం మంచిదన్న భావనను మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. తమ గురించి తాము గొప్పగా చెప్పుకునే ఆంధ్రోళ్లకు.. తమ రాష్ట్రా ఆవతరణ దినోత్సవానికి సంబంధించి ఒక తేదీ లేకపోవటానికి మించిన శోచనీయం ఏమిటన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది.