Begin typing your search above and press return to search.
ఇద్దరి దోస్తుల గురించి మాట్లాడుకున్నారా?
By: Tupaki Desk | 2 July 2018 4:37 AM GMTమాజీ ప్రధాని దెవేగౌడ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ల మధ్య ఏం చర్చ జరిగింది? అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనధికార ప్రకటన వచ్చినంతవరకూ దీనిపై బోలెడన్ని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. వీరిద్దరి భేటీ సందర్భంగా ప్రగతి భవన్ లో చాలామందే ఉన్నారు.
మంత్రి కేటీఆర్.. ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ శేరి సుభాష్ రెడ్డి.. మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి.. ఎంపీ సంతోష్ కుమార్.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఉన్నారు. మరింత మంది ఉన్నప్పుడు.. దెవేగడ.. కేసీఆర్ ల మధ్య సంభాషణ దేనిపై జరిగిందన్న క్లారిటీ ఇవ్వరా? అంటే.. ఇవ్వరనే చెప్పాలి.
తమ నోటి వెంట ప్రగతిభవన్ మాటలు బయటకు వచ్చినట్లు తెలిస్తే.. మళ్లీ అందులోకి ఎంట్రీ ఇవ్వరన్న జాగ్రత్తే వారి చేత ఆచితూచి అన్నట్లు వ్యవహరించేలా చేస్తుందని చెబుతారు.ఇదిలా ఉంటే.. మాజీ ప్రధాని దెవేగౌడ.. సీఎం కేసీఆర్ ల మధ్య భేటీలో ఒక ఆసక్తికర వ్యవహారం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి దెవేగడ కుమారుడు కుమారస్వామి నేతృత్వం వహిస్తున్నారు. అదే సమయంలో.. బీజేపీతో రహస్య స్నేహాన్ని కొనసాగిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.
రెండు భిన్న ధ్రువాల్లాంటి జాతీయ పార్టీలతో స్నేహం చేసే ఇద్దరు మిత్రులు.. ఒకచోట కలవటం.. తాజా రాజకీయ పరిణామాల మీద చర్చించుకోవటం ఆసక్తికరంగా మారింది.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత గొప్పగా లేదన్న మాట దెవేగౌడ వ్యాఖ్యానిస్తే.. బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందన్న మాట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చినట్లు తెలుస్తోంది ఇరువురు మిత్రులు.. తమ తమ రాజకీయ మిత్రుల గురించి.. వారి బలాల గురించి మాట్లాడుకున్నట్లుగా చెబుతున్నారు. ఇక.. సార్వత్రిక ఎన్నికల తర్వాత జాతీయ స్థాయి కూటమి గురించి ఆలోచించాలన్న మాట ఇద్దరి నోట వినిపించినట్లు చెబుతున్నారు.