Begin typing your search above and press return to search.
పవన్ యాత్రకు బ్రేక్..రంజాన్ కారణం కాదా?
By: Tupaki Desk | 18 Jun 2018 1:43 PM GMTజనసేన పార్టీ రథసారథి - ఆ పార్టీకి అన్నీ తానై నడిపిస్తున్న పవన్ కళ్యాణ్...విషయంలో కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. పవన్ కళ్యాణ్ యాత్రకు అనూహ్య రీతిలో బ్రేక్ పడిందనేది ఆ వార్త సారాంశం. ఈద్ కారణంగా యాత్రకు బ్రేక్ పడిందనేది నిజమైనప్పటికీ...అదొక్కటే కారణం కాదని...పవన్‌కు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు కూడా అని అంటున్నారు. ఇందుకు నిదర్శనం...రంజాన్ ముగిసినప్పటికీ...పవన్ యాత్ర తిరిగి ప్రారంభం కాకపోవడమే. అయితే ఈ ఎపిసోడ్ పవన్ ఫ్యాన్స్ నే గందరగోళంలోకి నెట్టడం అసలు ట్విస్ట్.
2014 ఎన్నికల సందర్భంగా తెరమీదకు వచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కొద్దికాలం క్రితం వరకు చురుకుగా రాజకీయాల్లో లేని సంగతి తెలిసిందే. అయితే తాను క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన పవన్ అందుకు తగినట్లుగానే ఉత్తరాంధ్ర నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆయన యాత్ర అభిమానుల సందడి మధ్య పరవాలేదు అన్నట్లుగానే సాగింది. అయితే, గత వారం ఈ యాత్రలో ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. అదే పవన్ యాత్రకు బ్రేక్ పడటం. రంజాన్ కారణంగా తన యాత్రకు బ్రేక్ వేస్తున్నట్లు తెలిపిన జనసేనాని...తన బృందంలో ఎక్కువగా ముస్లింలు ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నానని ప్రకటించి....ఈద్ అయిపోగానే...యాత్ర ఉంటుందని వివరించారు. అంతేకాకుండా తన బృందంలో కొందరితో ఈద్ జరుపుకున్నారు కూడా!
అయితే, ఆ యాత్ర తిరిగి ప్రారంభం కాలేదు. రంజాన్ ముగిసి రెండ్రోజులు దాటిపోయినప్పటికీ...పవన్ యాత్రపై ఇటు మీడియాకు కానీ - అటు పవన్ పార్టీ నేతలకు కానీ స్పష్టత లేకపోవడం గమనార్హం. ఈ పరిణామం సహజంగానే పవన్ పొలిటక్ జర్నీ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. కాగా, పవన్ కు ఆరోగ్య సమస్యలు ఏదురయ్యాయని - ప్రధానంగా...కంటి ఇబ్బంది కారణంగా ఆయనీ నిర్ణయం తీసుకున్నారని పలువురు చెప్తున్నారు. ఏదీ ఏమైనా...పవన్ తన పాదయాత్ర విషయంలో కలిగి ఉన్న ఈ అస్పష్టత మాత్రం జనసేన శ్రేణులను నారాజ్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.