Begin typing your search above and press return to search.
జస్ట్ ఆస్కింగ్.. ప్రకాష్ రాజ్ ఇంతకూ ఏ పార్టీ..?
By: Tupaki Desk | 13 Jan 2019 1:57 PM GMTజస్ట్ ఆస్కింగ్ అనే పేరు పెట్టి... ట్విట్టర్ లో రాజకీయాలు చేయడం మొదలు పెట్టారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. సందర్భం వచ్చినప్పుడల్లా.. బీజేపీ పార్టీ - మోదీ - అమిత్ షా టార్గెట్ గా విరుచుకుపడ్డారు. బీజేపీని విమర్శించడంతో.. మిగిలిన పార్టీలు ఆటోమేటిగ్‌గా ప్రకాష్ రాజ్ వైపు చూశాయి. కొన్ని పార్టీలు అయితే.. ఆయనకు ఓపెన్ గా ఆఫర్ ఇచ్చాయి. కానీ ప్రకాశ్ రాజ్ మాత్రం తాను ఏ పార్టీలో చేరనని స్పష్టం చేసి.. వచ్చే ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు .
ప్రకటించడం వరకు బాగానే ఉంది కానీ.. ఆ తర్వాతే ఆయన బిహేవియర్ లో బాగా మార్పొచ్చింది. తాను బీజేపీ తప్ప అన్ని పార్టీలకు చెందిన వాడిని అనే ఫీలింగ్ ప్రజల్లో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో వివిధ పార్టీ నాయకుల్ని కలుస్తున్నారు. ఓ పక్క కాంగ్రెస్ వాళ్లతో భేటీ అవుతూనే మరోవైపు.. కేజ్రీవాల్ లాంటి లీడర్ తోనూ మిలాఖత్ అవుతున్నారు. దీంతో.. అసలు ఇంకా రాజకీయాలు మొదలుకాకముందే.. ప్రకాష్ రాజ్ రాజకీయాలు మొదలుపెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రజల్లో బీజేపీ పార్టీపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు ప్రకాష్ రాజ్. ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుందానే ప్లాన్ లో ఉన్నాడు ఈ విలక్షణ నటుడు.