Begin typing your search above and press return to search.

వైసీపీలో తెగని విజయవాడ తూర్పు లొల్లి

By:  Tupaki Desk   |   15 March 2019 9:58 AM GMT
వైసీపీలో తెగని విజయవాడ తూర్పు లొల్లి
X
విజయవాడ తూర్పు టికెట్ పై వైసీపీలో వార్ కొనసాగుతోంది. తూర్పు టికెట్ కోసం బొప్పన భవకుమార్, యలమంచిలి రవి వర్గాలు పొట్లాడుకుంటున్నాయి. తూర్పు టికెట్ ఖచ్చితంగా తనదేనంటూ బొప్పన భవకుమార్ గురువారం విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. 16నుంచి విజయవాడ ఎంపీ వైసీపీ అభ్యర్థి పీవీపీతో కలిసి ప్రచారం చేస్తానని ప్రకటించారు.

కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ టికెట్ తనదేనని.. 16న వైసీపీ అధినేత విడుదల చేసే జాబితాలో తన పేరే ఉంటుందని యలమంచిలి రవి పేరు ఉంటుందని ఆయన వర్గాలు చెబుతున్నాయి. దీంతో విజయవాడ తూర్పు టికెట్ పై వైసీపీ అభ్యర్థి ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

యలమంచిలి రవి గత ఏడాది ఏప్రిల్ లో జగన్ పాదయాత్ర సందర్భంగా విజయవాడలో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అంతకుముందు వరకూ టీడీపీలోనే ఉన్నారు. అయితే పీవీపీ వైసీపీ లో చేరాక పరిస్థితులు మారాయి. విజయవాడ తూర్పు టికెట్ ను యలమంచిలి రవికి కాకుండా బొప్పన భవకుమార్ కు ఇవ్వాలని పీవీపీ జగన్ కు సూచించాడు. పీవీపీ ప్రతిపాదనకు జగన్ ఓకే చెప్పడంతో ఈ లొల్లి మొదలైంది.

పార్టీ అధిష్టానం సిగ్నల్స్ ఇవ్వడంతో భవకుమార్ 16నుంచి పీవీపీతో ప్రచారం చేస్తానని విలేకరులకు తెలిపారు. బొప్పన ప్రకటనతో యలమంచిలి వర్గీయుల్లో ఒక్కసారిగా టెన్షన్ నెలకొంది.

యలమంచిలి రవి తండ్రి మాజీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు. ఈయనకు నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. 2009లో పీఆర్పీ తరుఫున ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. కాంగ్రెస్ లో పీవీపీ విలీనం తర్వాత టీడీపీలో చేరారు. గత ఏడాది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజా పరిణామాలతో రవి రాజకీయ భవిష్యత్తు డోలాయమానంలో పడింది.