Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్ల దెబ్బ‌కు రూ.1.86ల‌క్ష‌ల కోట్లు ఆవిరి!

By:  Tupaki Desk   |   17 March 2018 3:50 AM GMT
ఆంధ్రోళ్ల దెబ్బ‌కు రూ.1.86ల‌క్ష‌ల కోట్లు ఆవిరి!
X
ఆంధ్రోడి ఆగ్ర‌హానికి స్టాక్ మార్కెట్ భారీ కుదుపున‌కు గురైంది. దేశంలో రాజ‌కీయ స్థిర‌త్వంపై కొత్త‌గా చోటు చేసుకున్న సందేహాలు శుక్ర‌వారం ట్రేడింగ్ పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపించాయి. అంత‌ర్జాతీయంగా కొన్ని అంశాలు చోటు చేసుకున్న‌ప్ప‌టికీ.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన రెండు ప్రాంతీయ పార్టీలు లోక్ స‌భ‌లో ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ ను దారుణంగా దెబ్బ తీసింది.

ఇటీవ‌ల కాలంలో ఎప్పుడూ లేనంత దారుణంగా ప‌డిపోయింది. గ‌త నెల ఆరు త‌ర్వాత ఇంత భారీగా ప‌డిపోయింది ఇప్పుడే కావ‌టం గ‌మ‌నార్హం. ఎన్డీయే కూట‌మి నుంచి టీడీపీ వైదొల‌గ‌టం.. ఏపీ విప‌క్షం.. అధికార‌ప‌క్షం రెండూ వేర్వేరుగా మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని లోక్ స‌భ‌లో ప్ర‌వేశ పెట్ట‌టం.. దీనికి ప‌లు జాతీయ పార్టీలు మ‌ద్ద‌తు ఇచ్చిన నేప‌థ్యంలో స్టాక్ మార్కెట్ భారీగా ప్ర‌భావిత‌మైంది.

శుక్ర‌వారం చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల‌కు.. అంత‌ర్జాతీయంగా కొన్ని ప‌రిణామాలు తోడు కావ‌టంతో స్టాక్ మార్కెట్ ప‌త‌నం ఎక్కువ‌గా ఉంది. దీని కార‌ణంగా ఇన్వెస్ట‌ర్ల మ‌దుపు మొత్తంలో రూ.1.86 ల‌క్ష‌ల కోట్ల మేర త‌రిగిపోయింది. దేశీయ మార్కెట్లోని బ్లూచిప్ కంపెనీలు మొద‌లు మ‌ధ్య‌త‌ర‌హా కంపెనీల వ‌ర‌కూ అమ్మ‌కాల ఒత్తిడికి గుర‌య్యాయి. కొన్ని కంపెనీలు మిన‌హా..చాలా కంపెనీలు తీవ్ర ప్ర‌భావానికి గుర‌య్యాయి. మొత్తంగా చూస్తే.. ఇంత‌కాలం ఆంధ్రోళ్ల‌ను ప‌ట్టించుకోని మోడీ స‌ర్కారుకు దిమ్మ తిరిగిపోయేలా తాజా ప‌రిణామం చోటు చేసుకుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.