Begin typing your search above and press return to search.

వూహాన్ లో నాలుగోరోజు నో పాజిటివ్ కేసులు

By:  Tupaki Desk   |   22 March 2020 12:30 PM GMT
వూహాన్ లో నాలుగోరోజు నో పాజిటివ్ కేసులు
X
కరోనా వైరస్.. పుట్టింది చైనాలోని వూహాన్ సిటీ. ఇక్కడి నుంచే చైనాకు ప్రపంచానికి పాకింది. వేలమంది ప్రాణాలు తీస్తోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే కరోనాను పూర్తిగా కంట్రోల్ చేసింది చైనా.. ఎంతలా అంటే కరోనా వైరస్ పుట్టిన చైనాలోని వూహాన్ సిటీలో నాలుగోరోజు వరుసగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

కరోనా పుట్టిన వూహాన్ లో పరిస్థితి పూర్తిగా మెరుగు పడింది. డిసెంబర్ లో కరోనా వైరస్ బయటపడింది. చైనా ప్రభుత్వం ఈ సిటీని దిగ్భంధించి కఠిన చర్యలు తీసుకుంది. సిటీని మూసివేసి ఎవరిని బయటకు, లోనికి రానీయలేదు. ఐసోలేషన్ లో ఉంచి ప్రజలను చికిత్స చేసింది. దీంతో సూపర్ మార్కెట్లు, నిత్యావసరాల షాపులు తెరిచారు. వరుసగా నాలుగో రోజు వూహాన్ లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఆంక్షలు సడలించి ప్రజల రాకపోకలకు అనుమతిస్తున్నారు.

ఇప్పటికే చైనాలో కరోనా సోకి 3వేల మందికిపైగా చనిపోయారు. 81వేలమందికి సోకింది. 71వేల మంది కోలుకుంటున్నారు. చికిత్స తీసుకుంటున్నారు. వూహాన్ లో 0 కేసులు నమోదుకావడంతో చైనా కరోనానుంచి బయటపడినట్టే కనిపిస్తోంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా మాత్రం కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇటలీ లో అయితే చైనాను మించి మరణాలు కొనసాగుతున్నాయి. 3800మంది ఇప్పటికే చనిపోయారు.