Begin typing your search above and press return to search.
శుభ శ్రావణం : వరాల తల్లికి వేడుకోలు ! ఇదే !
By: Tupaki Desk | 5 Aug 2022 9:30 AM GMTఅభివృద్ధికి సంబంధించి మాత్రమే చేస్తున్న విన్నపం ఇది. శుభం చేకూర్చే పనులు ఇవాళ నుంచి ఆరంభం అయితే బాగుండు అని కోరుకుంటూ చేస్తున్న విన్నపం ఇది. ఎందుకంటే శుభ శ్రావణ శుక్రవారం ఇవాళ. అంటే మగువలంతా కలిసి ఓ చోట చేరి వరలక్ష్మీ వ్రతం చేసుకునే రోజు. ఇంకా చెప్పాలంటే అమ్మవారిని నియమ నిష్టలతో ఉపాసించే రోజు ఇది. అందుకే ఈ సారి అభివృద్ధి వరం అన్నది ఎవరికి దక్కుతుంది అని ఓ ఆలోచన ఆధారంగా రాస్తున్న కథనం ఇది.
అంతా ఆశించిన విధంగానో లేదా కోరుకున్న విధంగా అస్సలు అభివృద్ధి అన్నది జరగడం లేదు అని రాయడం తప్పు. అభివృద్ధి పనులు చేపడుతున్నారు కానీ అవన్నీ చాలా సూక్ష్మ స్థాయికే పరిమితం అయి ఉన్నాయి. చెప్పుకోదగ్గ రీతిలో ఆంధ్రావనిలో చేపడుతున్న పనులేవీ లేకపోవడం నిజంగానే పండుగ వేళ ప్రస్తావించదగ్గ విషయం.
ముఖ్యంగా రోడ్లకు సంబంధించి కానీ, వాటి మరమ్మతులకు సంబంధించి కానీ ఎక్కడా ఆశించిన స్థాయిలో పనులు లేవు. ఉన్నా కూడా కొద్దిపాటి నిధులతో కొద్ది పాటి పనులే చేసి వెళ్లిపోతున్నారు.
అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ అన్నది రెండున్నరేళ్లుగా లేదు. కనీసం పంట కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సైతం తొలగించేందుకు ఆసక్తి అన్నది చూపిన దాఖలాలే లేవు. ఈ తరుణాన అభివృద్ధి అన్నది ఎలా వస్తుంది. అందుకు తగ్గ నిధులు ఎక్కడి నుంచి వస్తుంది అన్న ప్రశ్నలే వేధిస్తున్నాయి ఆంధ్రా ప్రజలను !
ఉప ఎన్నికలు ఉన్నా లేదా నేరు ఎన్నికల్లో గెలుపు ప్రతిష్టాత్మకం కావాలన్నా అప్పటికప్పుడు నిధులు ఇస్తున్నారు. ఆ విధంగా మొన్న గౌతం రెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఆత్మకూరు నియోజకవర్గానికి నిధులు ఇచ్చారు. అక్కడ ఉప ఎన్నికల్లో ఆయన తమ్ముడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మంచి మెజార్టీతోనే నెగ్గుకు వచ్చారు.
అదేవిధంగా ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో గెలుపే ధ్యేయంగా సీఎం నిధులు ఇస్తున్నారు. ఇది కూడా ఓ శుభ పరిణామమే ! కాదనం కానీ ఇదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల అభివృద్ధికీ ప్రాధాన్యం ఇస్తే ఎంత బాగుంటుందో ! కానీ ఇక్కడ ఆ విధంగా జరగడం లేదు. కొన్నింటికే కీలక ప్రాధాన్యం ఇస్తూ కొన్నింటిని అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో అభివృద్ధికి సంబంధించి విడుదల అయ్యే కొద్దో గొప్పో నిధులు కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిపోతున్నాయి. మరి ఈ శ్రావణం వేళ అభివృద్ధి వరం ఎవరికి ఏ ప్రాంతానికి ?