Begin typing your search above and press return to search.

భార్యం ఎయిడ్స్ ఉంద‌ని... కోర్టు క‌ళ్ల‌కే గంతలు క‌ట్టిన భ‌ర్త‌

By:  Tupaki Desk   |   25 Nov 2022 1:30 AM GMT
భార్యం ఎయిడ్స్ ఉంద‌ని... కోర్టు క‌ళ్ల‌కే గంతలు క‌ట్టిన భ‌ర్త‌
X
త‌న భార్య‌కు హెచ్ఐవీ ఎయిడ్స్ సోకింద‌ని, త‌న‌కు విడాకులు ఇప్పించాల‌ని ఒక భ‌ర్త ఏకంగా హైకోర్టు క‌ళ్ల‌కే గంత‌లు క‌ట్ట‌డానికి చేసిన ప్ర‌య‌త్నం బెడిసి కొట్టింది. ఆయన చెప్పేవ‌న్నీ అబ‌ద్దాల‌ని, అలాంటి ఆధారాలు ఏమీ ఆయ‌న చూపించ‌లేక‌పోయార‌ని న‌మ్మిన న్యాయ‌స్థానం విడాకులు మంజూరు చేయ‌డానికి తిర‌స్క‌రించింది. బొంబాయి హైకోర్టులో జరిగిన ఈ సంఘ‌ట‌న న్యాయ‌మూర్తుల‌ను సైతం అవాక్క‌య్యేలా చేసింది.

మ‌హారాష్ట్రలోని పుణే న‌గ‌రానికి చెందిన 41ఏళ్ల వ్య‌క్తి త‌న‌కు 2003లో వివాహ‌మైంద‌ని, త‌న భార్య వింత ప్ర‌వ‌ర్త‌న క‌లిగి ఉంద‌ని, త‌న‌తో త‌న కుటుంబ స‌భ్యుల‌తో ఆమె స‌క్ర‌మంగా ఉండ‌టం లేద‌ని, ఆమెకు ఎయిడ్స్‌సోకింద‌ని, ప‌రీక్ష‌ల్లో ఆమెకు హెచ్ ఐ వీ పాజిటివ్ వ‌చ్చింద‌ని, భార్య‌కు ఎయిడ్స్ సోకింద‌ని, ప‌రీక్ష‌ల్లో ఆమెకు పాజిటివ్ వ‌చ్చింద‌ని ఆ కార‌ణం చేత నాకు ఆమె నుంచీ విడాకులు ఇప్పించాల‌ని 2011లో బొంబాయి హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశాడు. ఈ పిటిష‌న్ను విచారించిన బొంబాయి హైకోర్టు ఆమెకు హెచ్ ఐవీ సోకిన‌ట్లు మెడిక‌ల్ రిపోర్టులు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది.

ఆ భ‌ర్త అలాంటి రిపోర్టుల స‌మ‌ర్ఫించ‌లేక‌పోయారు. మ‌రోవైపు ఆయ‌న భార్య కూడా త‌న‌కు ఎయిడ్స్ లేద‌ని ప‌రీక్ష‌ల్లో కూడా నెగ‌టివ్ వ‌చ్చిన‌ట్లు, త‌న భర్త కావాల‌నే త‌న‌ను బ‌ద‌నామ్ చేయ‌డానికి ఇలా చేస్తున్నాడ‌ని న్యాయ‌స్థానానికి విన్న‌వించుకుంది.

కేసును ప‌రిశీలించిన న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ నితిన్ జామ్‌దార్‌, జ‌స్టిస్ ష‌ర్మిలా దేశ్‌ముఖ్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విడాకులు మంజూరు చేయ‌డానికి తిర‌స్క‌రించింది. ఈ వ్య‌క్తి త‌న భార్య‌కు హెచ్ ఐవీ ఉన్న‌ట్లు ఆధారాలేవీ న్యాయ‌స్థానానికి చూపించ‌లేక‌పోయారు, ఆయ‌న త‌న భార్య‌కు ఎయిడ్స్ ఉంద‌ని త‌న కుటుంబ స‌భ్యులు, బంధువుల్లో, స‌మాజంలో ఆమె ప‌రువు తీయ‌డానికి ఈ పిటీష‌న్ వేసిన‌ట్లుగా ధ‌ర్మాస‌నం భావిస్తోంద‌ని న్యాయ‌స్థానం ఆ వ్య‌క్తిని మంద‌లించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.