Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తిలో ఇదో షాకింగ్ ప‌రిణామం

By:  Tupaki Desk   |   10 July 2016 6:41 AM GMT
అమ‌రావ‌తిలో ఇదో షాకింగ్ ప‌రిణామం
X
అమ‌రావ‌తి... కేవలం న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని మాత్ర‌మే కాదు. ఆ రాష్ట్ర అభివృద్ధికి - ఆంధ్రుల వార‌స‌త్వానికి ప్ర‌తీక. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆంధ్రప్రజల అభ్యున్నతి కోసం అనేక విధాలుగా నిర్మాణం చేపట్టిన రాజధాని అమరావతిలో ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. తాత్కాలిక సచివాలయంలోని అధికారుల ప్రాంగణాలు వెలవెలబోతున్నాయి. ప్ర‌భుత్వం ప‌డిన ఆతృత - ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నిర్ణ‌యం - ఉద్యోగుల నిర్ణ‌యం ఇందుకు కార‌ణ‌మ‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం రాజధాని లేని నవ్యాంధ్రకు నూతన రాజధాని నిర్మాణాన్ని అమరావతిలో చేపట్టారు. అధికారులంతా అమరావతి నుంచే పాలన కొనసాగించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట మేరకు అన్ని వర్గాల అధికారులు అమరావతికి తరలివచ్చారు. అయితే అధికారులు అనేక సంవత్సరాలుగా హైదరాబాద్‌ లో ఉండి అక్కడే విధులు నిర్వహించడం - ఆ ప్రాంతంతో విడదీయరాని బంధం ఉండడంతో ఒక్కసారిగా వదిలి రావడానికి కొన్ని ఆంక్షాలు ప్రభుత్వానికి విధించారు. ఇందులో ప్రభుత్వం కూడా సాధ్య అసాధ్యలను పరిశీలించి వారానికి ఐదు రోజులు పని దినాలను కల్పిస్తూ శని - ఆదివారాలు సచివాలయ ఉద్యోగులకు సెలవు దినాలుగా ప్రకటించింది. దీంతో అమరావతి ఉద్యోగులందరూ శని - ఆదివారాలు సెలవు దినాల నిమిత్తం వెళ్ళిపోవడం - తాత్కాలిక సచివాలయంలో కార్యకలాపాలు కొనసాగించిన అతికొద్దిమంది అధికారులు కూడా లేకపోవడంతో అక్కడ వెలవెలబోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

దీంతో పాటు నవ్యాంధ్ర అభివృద్దిలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ విదేశాలను చుట్టు ముట్టే నేపధ్యంలో రష్యా పర్యటనకు వెళ్లడం ఒక విధంగా లోటు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కూడా రాష్ట్రంలో లేకపోవడం - రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం సాధారణ సెలవులో భాగంగా కార్యాలయాలో లేకపోవడంతో ఒక్కసారిగా రాజధాని ప్రాంత కార్యాలయాలన్ని బోసిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఏదిఏమైనప్పటికి నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రాంత అభివృద్దిలో భాగస్వామ్యులవుతున్న అధికార యంత్రాంగం ప్రభుత్వ అధినేతలు కూడా ఆశించిన స్థాయిలో అందుబాటులో ఉండలేని పరిస్థితిలు అప్పుడప్పుడు ఈ రాష్ట్రంలో చోటుచేసుకోవడం ఒక విధంగా తీరని లోటుగా ప్రజలు భావిస్తున్నారు.