Begin typing your search above and press return to search.

కరోనాతో ఇక సహజీవనమే..అంతం లేదట !

By:  Tupaki Desk   |   18 Aug 2021 11:30 PM GMT
కరోనాతో ఇక సహజీవనమే..అంతం లేదట !
X
కరోనావైరస్ మనల్ని వదిలిపోదు , మనతోనే ఉంటుంది. భవిష్యత్తు తరాలు కూడా ఈ కరోనా మహమ్మారితో కలిసి సహజీవనం చేయాల్సిందే. కరోనా కు ఒకసారి మానవ రోగనిరోధక వ్యవస్థ అలవాటు పడ్డాక దానికితగినట్టుగా రోగనిరోధకత కూడా పెరిగిపోతుంది. ఎన్నో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా తాత్కాలికంగా మాత్రమే వైరస్ వ్యాప్తి, ప్రభావాన్ని తగ్గించగలం. కానీ, పూర్తిగా నిర్మూలించలేమనేది తప్పక తెలుసుకోవాల్సిన వాస్తవం. కరోనా వైరస్ ఇప్పటికే అనేక వేరియంట్లు, మ్యుటేషన్లతో మరింత తీవ్రంగా మారింది. రానున్నరోజుల్లో ఇలాంటి వైరస్ మ్యుటేషన్లు మరెన్నో విజృంభించే పరిస్థితి లేకపోలేదు.

కరోనావైరస్ అనేది ఇప్పుడే కొత్తగా పుట్టలేదు. గతంలోనూ కరోనావైరస్ కుటుంబానికి చెందిన ఎన్నో జాతులు మానవాళిపై విజృంభించాయి. 1980వ దశకంలో ఆసుపత్రి వైద్యులు ఉద్దేశపూర్వకంగా 15 మంది వాలంటీర్లకు కరోనావైరస్ సోకేందుకు ప్రయత్నించారట. అప్పట్లో కరోనా ఉనికిలో లేదు. అప్పట్లో 229E అనే వైరస్ విజృంభించింది. ఇది కరోనా కుటుంబంలో ఒకటిగా గుర్తించారు. ఈ వైరస్ సోకితే సాధారణ జలుబు, జ్వరం వంటి లక్షణాలే కనిపిస్తాయి. మొదటిసారి చిన్నపిల్లల్లో ఈ వైరస్ సోకింది.

మరో ఏడాదిలో వైద్యులు ఇదే ప్రయోగాన్ని మళ్లీ చేశారు. మొదటి సారి పాల్గొన్న వాలంటీర్లలో ఒకరు మినహా మిగిలిన వారందరినీ ట్రాక్ చేసారు. వారందరికీ మళ్లీ 229E ముక్కుకి అప్లయ్ చేశారు. ఇంతకు ముందు సోకిన వారిలో ఆరుగురికి మళ్లీ ఈ వ్యాధి సోకింది. కానీ రెండోసారి, ఎవరికీ లక్షణాలు కనిపించలేదు. కరోనా రోగనిరోధకత త్వరగా క్షీణిస్తుందని గుర్తించారు. అందుకే మళ్లీ వైరస్ సంక్రమిస్తుందని వైద్యులు కనుగొన్నారు. కానీ తరువాతి ఇన్‌ ఫెక్షన్‌ లు స్వల్పంగా ఉంటాయని, లక్షణాలు కూడా చాలావరకు కనిపించవని పేర్కొన్నారు.

1980-90లలో కరోనావైరస్‌లపై ఈ చిన్న అధ్యయనం అనేక పరిశోధనలకు ప్రోత్సహించింది. 2020లోనూ కొత్త కరోనావైరస్ ఉద్భవించినప్పుడు పరిశోధకులు సైతం దశబ్దాల నాటి పరిశోధనలను మరోసారి అధ్యయనం చేశారు. కరోనాకు మూలాలను వెతికే పనిలో పడ్డారు. సాధారణంగా కరోనా కి కారణమయ్యే SARS-CoV-2 ఆవిర్భావానికి ముందు, కేవలం నాలుగు కరోనావైరస్‌లు మాత్రమే ఉన్నాయట.. అందులో 229E అనే వైరస్ ఒకటి. ఈ నాలుగు కరోనావైరస్‌లు సాధారణ జలుబుకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడీ ఈ కొత్త కరోనావైరస్ ఐదోది. 229E వైరస్ నుంచి జలుబులానే కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తాయి. ఇప్పుడు అనేక కొవిడ్ వేరియంట్లు, స్ట్రెయిన్లు మ్యుటేషన్ చెందాయి. లక్షణాల్లో కూడా అనేక మార్పులు కనిపిస్తున్నాయి.

కరోనావైరస్ కు అంతమే లేదా అంటే.. అది మనపైనే ఆధారపడి ఉందంటున్నారు నిపుణులు. కరోనావైరస్ బారినపడకుండా ఉండాలంటే అందుకు తగినవిధంగా జీవించాల్సి ఉంటుంది. ఎప్పటిలానే మాస్క్ ధరించడంతో పాటు సామాజిక దూరం, చేతులను శానిటైజ్ చేసుకోవడం వంటివి భవిష్యత్తులోనూ కొనసాగించాలి. కరోనా టీకాలను ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వేయించుకోవాలి. ప్రస్తుతానికి చిన్నారులకు కరోనా టీకాలు అందుబాటులోకి రాలేదు. పిల్లలకు కూడా టీకాలు వేయడం వల్ల భవిష్యత్తు తరాలకు కూడా ముందుగానే కరోనా వ్యాప్తిని నియంత్రించడం సాధ్యపడుతుంది.

టీకాలతో తీవ్రమైన అనారోగ్యం, మరణాల నుంచి రక్షిస్తాయి. శ్వాసకోశ వైరస్లపై టీకాలు అరుదుగా పూర్తి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడతాయి ఎందుకంటే, ముక్కులో కంటే ఊపిరితిత్తులలో రోగనిరోధక శక్తిని ప్రేరేపించడంలో బాగా పనిచేస్తాయి. ఫైజర్ మోడెర్నా వ్యాక్సిన్‌ లతో 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తాయని పలు అధ్యయనాల్లో రుజువైంది. బీటా, గామా, ఇప్పుడు డెల్టా వంటి కొత్త వేరియంట్లు విజృంభణతో టీకాలతో కొంత రక్షణ తగ్గించాయి. అయిననప్పటికీ టీకాలు తీవ్రమైన అనారోగ్యం నుంచి కాపాడతాయనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. రోనావైరస్ విషయంలో ప్రతిఒక్కరూ మానసికంగా జీవించేందుకు సిద్ధపడాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.