Begin typing your search above and press return to search.
ఏపీ వాసులకు నో ఎంట్రీ: తెలంగాణకే మద్దతిచ్చిన సుప్రీంకోర్టు
By: Tupaki Desk | 2 July 2021 7:30 AM GMTతెలుగు రాష్ట్రాలు భౌతికంగా విడిపోయినా ఇంకా సామాజికంగా విడిపోలేదు. హైదరాబాద్ లో ఏపీ వాసులు మెజార్టీ సంఖ్యలో ఉన్నారు. వారి పెట్టుబడులు, ఆస్తులు అన్నీ ఒకప్పటి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఉన్నాయి. అయితే తెలంగాణ ఏర్పడ్డాక పరిస్థితులు మారాయి. ఏపీ వాసులపై అనాదిగా ఉన్న పగ ప్రతీకారాన్ని తెలంగాణ వాసులు, మంత్రులు అప్పుడప్పుడూ బయటపెడుతున్నారు.
ఇటీవల కరోనా కల్లోలంలో తెలంగాణలోని ఏపీ వాసులను రానీయకుండా చేసిన వైనం వివాదాస్పదమైంది. హైకోర్టు ఆదేశించినా వినకుండా తెలంగాణ సర్కార్ సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్ లను ఆపేయడం దుమారం రేపింది. నిజానికి విభజన చట్టం ప్రకారం.. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. ఏపీ, తెలంగాణకు 10ఏళ్లు ఉంటుంది. కానీ ఏపీ విడిపోయి అమరావతిలో రాజధాని కట్టుకోవడంతో సంబంధాలు తెగి హైదరాబాద్ మొత్తం తెలంగాణకే పోయింది.
ఈ క్రమంలోనే ఏపీ నుంచి వచ్చే వారికి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పెట్టిన ఈపాస్ నిబంధనపై ఏపీ వాసులు మండిపడ్డారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ లా విద్యార్థి దీనిపై సుప్రీంకోర్టుకు ఎక్కడా. దీనిపై పిటీషన్ దాఖలు చేసిన సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇరు రాష్ట్రాలకు ుమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కు వచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈపాస్ పెట్టడం ఏంటని పిటీషన్ వాదించారు.
అయితే సుప్రీంకోర్టు మాత్రం ధీనిపై భిన్నంగా స్పందించింది. 2014 నాటి ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఇరురాష్ట్రాల మధ్య రాకపోకలకు అంతరాలు కలిగించకూడదన్న నిబంధనపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5 కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఈపాస్ కు అడ్డంకి కాబోదని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే విపత్తు నిర్వహణ చట్టం కింద జారీ చేసిన ఈ పాస్ కు సెక్షన్ 5 వర్తించదని తెలిపింది.
అయినా కరోనా సమయంలో జారీ చేసిన ఈ పాస్ నిబంధన ఇప్పుడు కరోనా ముగిసి అన్నీ ఎత్తేసిన వేళ కాలం చెల్లిందని సుప్రీంకోర్టు ఈ పిటీషన్ పై విచారణ అవసరం లేదని వ్యాఖ్యానించింది. అత్యవసర సమయాల్లో ఈపాస్ జారీ చేయడంలో తప్పు లేదని.. తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగానే సుప్రీంకోర్టు తీర్పు నివ్వడం విశేషం.