Begin typing your search above and press return to search.

భారత్‌లోనే ఉన్నా ఈ ఐదు ప్రదేశాలకి భారతీయులకు నో ఎంట్రీ

By:  Tupaki Desk   |   21 Jun 2021 12:30 PM GMT
భారత్‌లోనే ఉన్నా ఈ ఐదు ప్రదేశాలకి  భారతీయులకు నో ఎంట్రీ
X
ప్రపంచంలో బాగా స్వేచ్ఛ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. దేశ పౌరుడు దేశంలోని ఏ ప్రాంతానికి అయినా వెళ్లి తనకి నచ్చినట్టు జీవించవచ్చు. ఉపాధి పొందవచ్చు. ఏ రాష్ట్రం కూడా ఇతర రాష్ట్రాల వాళ్లను పొమ్మనదు, వెళ్లిపొమ్మనే హక్కు కూడా ఉండదు. కానీ కొన్ని ప్రాంతాల్లో భారతీయులకు ప్రవేశం లేదని మీకు తెలుసా, దేశంలోనే ఉన్నా కూడా భారతీయులకు ప్రవేశం నిషేధం విధించిన ప్రదేశాలు,హోటళ్లను ఎప్పుడైనా చూశారా, కనీసం ఎప్పుడైనా విన్నారా, అవును భారతీయులే యజమానులుగా ఉన్నా కూడా కొన్ని హోటళ్లలోకి,ప్రదేశాల్లోకి భారతీయులకు నిషేధం విధించారు. ఈ ప్రదేశాల్లోకి మీరు వెళ్ళారంటే చాలు మీకు కనీసం గేట్ లోపల్లోకి కూడా అనుమతించరు.ఇంకా అక్కడ ఇండియన్స్ కి అనుమతించమని పెద్ద పెద్ద బోర్డ్ లు కూడా పెట్టి మీకు బయటకి గెంటేస్తారు.

ఆ ప్రదేశాలేంటో ఒకసారి చూద్దామా..

యునో ఇన్ హోటల్.. భారత సిలికాన్ సిటీగా పేరు గాంచిన బెంగళూరు నగరంలో ఉన్న యునో ఇన్ హోటల్లోకి భారతీయులకు ప్రవేశం నిషేధం. 2012లో ప్రారంభమైన ఈ హోటల్లోకి కేవలం జపాన్ దేశీయులకు మాత్రమే అనుమతి ఉంది.ఎలక్ట్రానిక్, సాఫ్ట్‌వేర్‌ కార్యకలాపాలు, కార్యాలయాలకు బెంగళూరు కేంద్రంగా మారిన నేపథ్యంలో జపాన్ దేశాల ప్రజలు,కంపెనీల ప్రతినిధుల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో నిప్పాన్ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్ ఈ హోటల్ ప్రారంభించింది.ఈ హోటల్లో భారతీయులను కనీసం రిసెప్షన్ వద్దకు కూడా రానివ్వరు.పొరపాటున హోటల్లోకి వెళ్ళటం చూశారంటే మాత్రం గేటు దగ్గరే సెక్యురిటీ మిమ్మల్ని ఆపేస్తారు.

కేఫ్ ఫ్రీ కేసోల్ : ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన ప్రకృతి అందాలకు,పర్యాటక ప్రాంతాలకు చిరునామాగా నిలిచే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వెలసిన చిన్న రెస్టారెంట్ కేఫ్ ఫ్రీ కేసోల్. ఇంత చిన్న రెస్టారెంట్లోకి భారతీయుల ప్రవేశాన్ని నిషేధించడం విశేషం. ఎత్తైన కొండలు,పర్యాటక ప్రాంతాలు ఉండడం వల్ల విదేశాల నుంచి పర్యాటకుల పెద్ద సంఖ్యలో వస్తుండడంతో అక్కడికి వచ్చే విదేశీ పర్యాటకులు ఇదే హోటల్కు వస్తుండడంతో భారతీయులకు ప్రవేశం నిషేధించారట. పొరపాటున మీరు ఆ రెస్టారెంట్ లో వెయిటర్ చూడట్లేదని లోపలికెళ్ళినా మీకు మెనూ గానీ, గ్లాస్ మంచి నీళ్ళు గానీ ఇవ్వరట.భారతీయులకే మాత్రమే కాదు భారతీయ భాషలను సైతం హోటల్లో నిషేధించడం గమనార్హం. ఈ హోటల్ బయట, గోడపైన, ఆఖరికి బోర్డు పైన కూడా మీకెక్కడా భారతీయ భాషలు కనిపించవు.

బ్రాడ్‌ ల్యాండ్ లాడ్జి, తమిళనాడు :తమిళనాడులో ఉన్న ఈ బ్రాడ్‌ల్యాండ్ లాడ్జిలో భారతీయులకు నో ఎంట్రీ. విదేశీ పాస్‌పోర్టులు ఉన్న వారికి మాత్రమే ఈ లాడ్జిలో రూమ్స్ ఇస్తారు. ఇలాంటి వివక్షాపూరిత విధానాల వల్ల ఈ లాడ్జి హాట్‌టాపిక్‌గా మారింది. ఇక్కడ ‘నో ఇండియన్ పాలసీ’ని చాలా కఠినంగా అమలు చేస్తారు.

గోవా సముద్ర తీరాలు : భారతీయులకు నిషేధం విధించిన ప్రదేశాల జాబితాలో గోవా బీచులు కూడా ఉన్నాయి.గోవాలోని అంజునా బీచ్‌లోకి భారతీయులకు ప్రవేశం నిషేధించారు. ఈ బీచ్ విదేశాల్లోని బీచ్‌ లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండడంతో విదేశీ పర్యాటకులు అంజునా బీచ్కు రావడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.తమ దేశంలో తిరిగినట్లే ఇక్కడా కూడా తిరగడానికి ఆసక్తి కనబరుస్తారు.అయితే విదేశీల వేషధారణ చూసిన ఇక్కడి యువకులు విదేశీలను చూడడానికే అంజునా బీచ్‌కు వెళుతుండడంతో విదేశీ పర్యాటకులు ఇబ్బంది పడుతుండడంతో ఈ బీచ్‌లోకి భారతీయులకు నిషేధం విధించారు.ఇదొక్కటే కాదు మరికొన్ని బీచ్లలోకి అక్కడి కొన్ని రెస్టారెంట్లలోకి సైతం భారతీయులను నిషేధించారు.

పాండిచ్చేరి : కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలోని కొన్ని బీచెస్ ప్రకృతి రమణీయత ఎంతో ఎక్కువగా వుంటుంది.కొన్ని వందల సంవత్సరాల క్రితం ఫ్రెంచ్ దేశం నుండి మన ఇండియాకి వ్యాపారం చేయటానికి ఫ్రెంచ్ వాళ్ళు వచ్చేటప్పుడు ఇక్కడ చాలా కట్టడాలు నిర్మించారు.ఇటు ఇండియన్ కల్చర్, అటు ఫ్రెంచ్ కల్చర్, ఇటు ఇండియన్ ఆర్కిటెక్చర్, అటు ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ కలసి మీకు చాలా చోట్లు కనిపిస్తుంది.అందుకే ఈ ప్లేసెస్ లోని బీచస్ లోకి కూడా విదేశీయులు చాలా ఎక్కువగా వస్తుంటారు.గోవా తర్వాత అటువంటి బీచెస్ ఎక్కువగా వున్న ప్రాంతం పాండిచ్చేరి.గోవా తర్వాత గోవా లాగా విదేశీయుల కోసమే కొన్ని బీచెస్ ఇక్కడ స్పెషల్ గా నిర్మించబడ్డాయి.ఇక్కడ విదేశీయులను తప్ప భారతీయులను అస్సలు అనుతించరట