Begin typing your search above and press return to search.
అమ్మ ఇంట్లోకి చిన్నమ్మకు నో ఎంట్రీ!
By: Tupaki Desk | 24 May 2020 5:30 AM GMTకాలం చాలా చిత్రంగా ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో ఊహించలేం. ఒకప్పుడు తిరుగులేని నేతగా.. తాను వస్తుంటే వంగి వంగి దండాలు పెట్టిన నేతలే.. తర్వాతి కాలంలో తానున్న ఇంట్లోనూ ఉండకుండా చేస్తారన్న ఆలోచన చిన్నమ్మ శశికళకు వచ్చి ఉండదు. అమ్మతో పాటు సుదీర్ఘకాలం పాటు పోయెస్ గార్డెన్ లోని అమ్మ నివాసం వేద నిలయంలో ఒక వెలుగు వెలిగిన ఆమె.. ఇంకెప్పటికి ఆ ఇంట్లోకి అడుగు పెట్టే ఛాన్సే లేదేమో?
చెన్నై పోయెస్ గార్డెన్ లో సువిశాలమైన వేద నిలయంలో అమ్మ.. చిన్నమ్మ ఏళ్ల తరబడి ఉంటాన్ని మర్చిపోలేం. రాష్ట్ర.. జాతీయ రాజకీయాలకు సంబంధించి ఎన్నో పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆ భవనం ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వ పరమైంది. జైలు జీవితానికి ముందు వరకూ చిన్నమ్మ వేదనిలయంలోనే ఉండేది. తన నెచ్చెలి అమ్మతో పాటు ఉన్న చిన్నమ్మ.. ఆమె మరణం తర్వాత వేద నిలయంలోనే ఉండిపోయారు.
అక్రమాస్తుల కేసు రూపంలో అగ్రహార జైల్లో ఉన్న శశికళ.. వచ్చే ఏడాది (2021)లో విడుదల కానున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తాను నివాసం ఉన్న వేద నిలయానికి వెళ్లే అవకాశం లేదు. ఇటీవలే.. అమ్మ ఇంటిని తమిళనాడు ప్రభుత్వం సొంతం చేసుకోవటంతోపాటు.. దాన్నో స్మారక చిహ్నంగా మార్చే ప్రయత్నాలు మహా జోరుగా సాగుతున్నాయి. దీంతో.. చిన్నమ్మ ఉండేందుకు వీలుగా ఏదైనా ఇంటిని చూడాల్సిన అవసరం ఆమె పార్టీ నేతలకు పడింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పోయెస్ గార్డెన్ సమీపంలోనే మరో భవనాన్ని తాత్కాలిక నివాసం కోసం ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. జైలు నుంచి చిన్నమ్మ విడుదలైన తర్వాత తమిళనాడు రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.