Begin typing your search above and press return to search.

ఐక్యరాజ్యసమితి కీలక సమావేశం..! కరోనా వ్యాక్సిన్ ​పైనే చర్చ! ట్రంప్ ​కు నో ఎంట్రీ..!

By:  Tupaki Desk   |   3 Dec 2020 11:10 AM GMT
ఐక్యరాజ్యసమితి కీలక సమావేశం..! కరోనా వ్యాక్సిన్ ​పైనే చర్చ! ట్రంప్ ​కు నో ఎంట్రీ..!
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్​పై ఆశలు చిగురిస్తున్నవేళ ఐక్యరాజ్యసమితి జనరల్​ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానున్నది. దాదాపు రెండురోజుల పాటు ఈ సమావేశం జరగనున్నట్టు సమాచారం. అయితే ఈ కీలకసమావేశంలో హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​కు మాత్రం అవకాశం దక్కలేదు. భారత్​ తరఫున విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వికాస్ స్వరూప్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో మొత్తం 100 దేశాల ప్రతినిధులు, 53 దేశాల ప్రభుత్వాధినేతలు, 38 మంది మంత్రులు ప్రసంగించనున్నారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్, బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, జపాన్ ప్రధాని యోషిహిడె సుగ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, యూరోపియన్ యూనియన్ అధినేత ఛార్లెస్ మిఛెల్, అమెరికా వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరఫున అలెక్స్ అజర్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. టర్కీ రాయబారి వొల్కన్ బోజ్కిర్ ఈ సమావేశాన్ని నడిపించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా కరోనా వ్యాక్సిన్​పైనే చర్చించనున్నట్టు సమాచారం.

కరోనా వ్యాక్సిన్​కోసం కృషి చేస్తున్న వివిధ దేశాల ఫార్మాకంపెనీలకు చెందిన వారు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆదార్ పూనావాలా కూడా ఈ సమావేశంలో పాలుపంచుకోనున్నారు. వ్యాక్సిన్​ పురోగతి తదితర అంశాల గురించి చర్చించనున్నారు.