Begin typing your search above and press return to search.
పెళ్లికాని జంటలకు ఇందిరాపార్క్ లోకి నో ఎంట్రీ.. నిజమెంత?
By: Tupaki Desk | 27 Aug 2021 12:30 AM GMTహైదరాబాద్ అనగానే పర్యాటకానికి మారుపేరుగా చెప్పొచ్చు. చార్మినార్ నుంచి గోల్కొండ దాకా.. జూపార్క్ నుంచి ఇందిరా పార్క్ దాకా అంతా స్వచ్ఛంగా వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు ఎంజాయ్ చేయడానికి ఒక బెస్ట్ ప్రదేశంగా హైదరాబాద్ ను చెప్పొచ్చు.
హైదరాబాద్ లోని దోమలగూడలో వందల ఎకరాల్లో విస్తరించిన ట్యాంక్ బండ్ కింద ఉన్న ఇందిరాపార్క్ గురించి తెలియని వారు ఉండరు. ఎంతో విషాలంగా ఉండే ఈ పార్క్ లో పిల్లలు, పెద్దలు, యువతీ, యువకులు వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు.
అయితే పార్కుల్లో అసాంఘిక కార్యకలాపాలు, మద్యం తాగడం , శృంగార కార్యకలాపాలకు నెలవై ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందిరాపార్క్ నిత్యం సందర్శకులతో కిక్కిరిసి ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు పార్క్ తెరిచి ఉంటుంది.
అయితే తాజాగా ఒక బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పెళ్లి కాని జంటలకు పార్కర్ లోకి నో ఎంట్రీ అన్న బ్యానర్ ను కొందరు వైరల్ చేశారు. ఇట్లు పార్క్ మేనేజ్ మెంట్ అని బ్యానర్లో స్పష్టం చేశారు. అయితే ఈ బ్యానర్ ఇందిరాపార్క్ వద్ద కట్టారని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అది అక్కడ కట్టారో లేదో తెలుసుకోకుండా విచారణ చేయకుండానే షేర్లు చేస్తున్నారు.
దీంతో ఇప్పుడు ఇందిరాపార్క్ లోకి పెళ్లి కాని జంటలకు నో ఎంట్రీ అన్న ఈ బ్యానర్ తెగ చక్కర్లు కొడుతూ తీవ్ర కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే 'మీరా సంఘమిత్ర' అనే సామాజికవేత్త జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీని ట్యాగ్ చేసి దీనిపై వివరణ కోరారు.పార్కులో ప్రవేశానికి పెళ్లిని అర్హత ప్రమాణంగా నిర్ధేశించడం ఏంటని నిలదీశారు. పబ్లిక్ పార్క్ అంటే అందరికీ ప్రవేశం ఉచితం కదా అని ప్రశ్నించారు. ఈ బ్యానర్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
అయితే ఆ బ్యానర్ ఇందిరాపార్క్ వద్ద ఏర్పాటు చేశారా? లేక ఎక్కడో ఏర్పాటు చేసింది ఇక్కడ ఏర్పాటు చేశారో తెలియదు కానీ.. మొత్తానికి ఇదిప్పుడు వైరల్ గా మారింది.