Begin typing your search above and press return to search.

ఏప్రిల్ 30 వరకు తిరుమలకు నో ఎంట్రీ..

By:  Tupaki Desk   |   31 March 2020 6:12 AM GMT
ఏప్రిల్ 30 వరకు తిరుమలకు నో ఎంట్రీ..
X
వెళ్లివచ్చే వారితో నిత్యం కల్యాణం.. పచ్చ తోరణం మాదిరి ఉండే తిరుమల పుణ్యక్షేత్రం ఇప్పుడెంతగా బోసిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు శ్రీవారి దర్శనానికి బ్రేక్ ఇస్తూ.. భక్తులను రానివ్వమంటూ టీటీడీ ఆదేశాలుజారీ చేయటం తెలిసిందే.

అంతేకాదు.. తిరుమలకు వెళ్లే రెండు ఘాట్ రోడ్లను మూసివేయటంతో బయటవారెవరూ తిరుమలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. భక్తుల్ని అనుమతించకున్నా.. స్వామి వారికి నిత్యం జరగాల్సిన కైంకర్యాల విషయంలో మాత్రం ఎలాంటి తేడా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం నిత్యం జరపాల్సిన అన్ని కార్యక్రమాల్ని తూచా తప్పకుండా చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మార్చి 31 వరకు మాత్రమే స్వామి వారి దర్శనం మీద పరిమితులు ఉన్న దానికి బదులుగా ఏప్రిల్ 14 వరకూ ఇప్పుడున్న యథాతధ పరిస్థితి నెలకొంటుందని చెబుతన్నారు. అదే సమయంలో.. ప్రతి రోజు తిరుపతిలో 30వేల మంది నిరాశ్రయులకు ఆహారం అందిస్తోంది టీటీడీ. ఢిల్లీ కలకలం చిత్తూరుజిల్లాలోనూ ఉంది. ఇప్పటివరకూ ఈ జిల్లాకు చెందిన 14 మందిని గుర్తించి తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించిన చికిత్స చేస్తున్నారు. ఏమైనా.. స్వామి వారి దర్శనం కోసం తహతహ లాడే వారంతా మరో రెండు వారాల పాటు వెయిట్ చేయక తప్పదు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వీలుంది.