Begin typing your search above and press return to search.

హిజాబ్.. మరో దుమారం.. మళ్లీ వాళ్లకు షాక్

By:  Tupaki Desk   |   22 April 2022 4:30 PM GMT
హిజాబ్.. మరో దుమారం.. మళ్లీ వాళ్లకు షాక్
X
గత కొన్నేళ్లుగా కర్ణాటకలో హిజాబ్ వివాదం ఎంతటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిందో అందరికీ తెలిసిందే. ఇది దేశమంతా పాకి చివరకు సుప్రీంకోర్టు, హైకోర్టుల తలుపుతట్టింది. హిజాబ్ వివాదం నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. హిజాబ్ ధరించి విద్యాలయాల్లోకి ప్రవేశించవద్దని స్పష్టం చేసింది. క్లాసు రూముల్లోకి హిజాబ్ ను అనుమతించాలని కోర్టులో వేసిన విద్యార్థులకు షాక్ ఇచ్చింది.

కర్ణాటక ప్రీ యూనివర్సిటీ బోర్డ్ ఈరోజు 12వ తరగతి విద్యార్థులకు ప్రీ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే క్లాస్ రూముల్లోకి హిజాబ్ ను అనుమతించాలని కోర్టులో మొదట పిటీసన్ వేసిన ఇద్దరు విద్యార్థినులు బురఖాలు ధరించి 12వ తరగతి పరీక్షలు రాసేందుకు ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లారు. అయితే అధికారులు ఆ ఇద్దరు అమ్మాయిలను వెనక్కి పంపించారు.

బురఖా ధరించే పరీక్షలు రాస్తామని హాల్ టికెట్లతో పరీక్ష కేంద్రానికి ఆలియా ఆసది, రేష్మాలు ఉడిపిలోని విద్యోదయ పీయూ కాలేజీలో ఈ ఘటన జరిగింది. వెళ్లారు. సుమారు 45 నిమిషాల పాటు ఆ అమ్మాయిలు ఇన్విజిలేటర్లు, ప్రిన్సిపల్ లను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే అందుకు ససేమిరా అనడంతో పరీక్షా కేంద్రం నుంచి విద్యార్థినులు వెనుదిరిగారు.

కాగా హిజాబ్ ధరించి వచ్చే విద్యార్థులను పరీక్షలకు అనుమతించమని ఆ రాష్ట్ర మంత్రి బీసీ నగేశ్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. హిజాబ్ వివాదం నేపథ్యంలో డ్రెస్ కోడ్ ను అనుసరించి విద్యార్థులకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు వివిధ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులను మోహరించారు. విద్యార్థులు హిజాబ్ ధరించి పరీక్షలకు వస్తే అనుమతించబోమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ స్పష్టం చేశారు.

చివరి పరీక్షల సమయంలో తమ హిజాబ్ ను ధరించడానికి అనుమతించాలని చాలా మంది ముస్లిం విద్యార్థినులు మంత్రిని అభ్యర్థించిన నేపథ్యంలో తాజా ఘటన చోటుచేసుకుంది.