Begin typing your search above and press return to search.
పెద్దాయనకు జైలు తప్పింది
By: Tupaki Desk | 28 Sep 2015 4:11 PM GMTజిందాల్ కంపెనీకి బొగ్గు క్షేత్రాలను కేటాయించడంలో నెలకొన్న అంశంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఊరట లభించింది. యూపీఏ హయాంలో బొగ్గు మంత్రిత్వశాఖ వ్యవహారాలు పర్యవేక్షించింది మన్మోహన్ సింగే కాబట్టి ఆయనదే ప్రధాన పాత్ర అని, అందువల్ల ఆయనకు సమన్లు జారీ చేసి విచారించాలని జార్కండ్ మాజీ సీఎం మధుకోడా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి అనుబంధగా అప్పటి బొగ్గు శాఖ సహాయమంత్రి దాసరి నారాయణరావు కూడా తన రాతపూర్వక పిటిషన్ లోనూ మన్మోహన్ ను విచారించాలని, ఆయనదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. అయితే వారిద్దరు చేసిన వాదనను సీబీఐ కొట్టివేసింది.
జిందాల్ కు గనుల కేటాయింపు అంశంలో మన్మోహన్ సింగ్ కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. దీంతో మన్మోహన్ కు ఊరట లభించింది. ఈ కేసులో ఇప్పటికే మధుకోడాతోపాటు మాజీ బొగ్గుశాఖా మంత్రి దాసరి నారాయణరావు, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి ఎస్పీ గుప్తాల్, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌తో సహా మొత్తం 14 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలుచేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో మన్మోహన్ పాత్ర ఉన్నట్లు వార్తలు రావడం కలకలం సృష్టించింది. అయితే తాజాగా ఈ రూపంలో మన్మోహన్ సింగ్ కు ఊరట దొరికిందని భావిస్తున్నారు.