Begin typing your search above and press return to search.
‘వెయ్యి.. 500 నోట్ల’కు బ్యాంకులు చెల్లుచీటి
By: Tupaki Desk | 25 Nov 2016 5:40 AM GMTఒకదాని తర్వాత ఒకటిగా సంచలన నిర్ణయాల్ని వెల్లడిస్తున్న కేంద్ర సర్కారు.. తాజాగా అలాంటి సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటివరకూ బ్యాంకుల్లో వెయ్యి .. రూ.500 నోట్లను మార్పిడి చేసుకునేందుకు ఉన్న వీలును గురువారం అర్థరాత్రి నుంచి ఎత్తి వేసింది. అనుమతించిన చోట్ల మాత్రమే పాత రూ.500 నోట్లను వినియోగించుకునే ఛాన్స్ ఉందని పేర్కొంది. వాస్తవానికి పాత వెయ్యి.. 500నోట్లను డిసెంబరు 30 వరకూ మార్పిడి చేసుకునే వీలు ఉంది.కానీ.. తాజాగా మార్పిడిపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.
మార్పిడి అంటే.. బ్యాంకులకు వెళ్లి నోట్లు ఇచ్చి.. తిరిగి కొత్త నోట్లు తీసుకునే విధానానికి కేంద్ర చెల్లుచీటి ఇచ్చేసింది. బ్యాంకులు.. పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడి కార్యక్రమం ఈ రోజు (నవంబరు 25) నుంచి ఉండదని ఆర్థిశాఖ పేర్కొంది. నోట్ల రద్దు ప్రకటన సమయంలో నోట్ల మార్పిడిని రూ.4వేల వరకూ తొలుత అనుమతించారు. దాని పరిమితిని తర్వాత రూ.4500లకుపెంచారు. కానీ.. ఈ నిర్ణయాన్ని పలువురు పెద్దఎత్తున దుర్వినియోగం చేస్తున్నారన్న సమాచారంతో దీని పరిమితిని కుదించారు. తాజాగా ఈ నిర్ణయాన్ని పూర్తిగా ఎత్తి వేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా తన నిర్ణయాన్ని వెల్లడించింది.
పెద్దనోట్లను రద్దు సమయంలో ప్రధాని మోడీ కొన్ని మినహాయింపులు ప్రకటించారు. పెద్దనోట్లను మార్పిడికి బ్యాంకులు.. పోస్టాఫీసులు పని చేస్తాయని వాటితో పాటు.. విమాన.. రైల్వే.. బస్సు టికెట్లకు.. పెట్రోల్ బంకుల్లోనూ.. ఆసుపత్రుల్లోనూ.. శశ్మాన వాటికల్లోనూ వాడుకోవచ్చన్న మినహాయింపులు ఇచ్చారు. తాజాగా వాటిని సవరిస్తూ కేంద్ర ఆర్థికశాఖ నిర్ణయం తీసుకుంది. మార్పిడి కోసం వెయ్యి నోట్లను ఎక్కడా తీసుకోరన్నది మరో కీలక నిర్ణయంగా చెప్పొచ్చు. కేవలం డిపాజిట్ల రూపంలో మాత్రమే వెయ్యి నోట్లను బ్యాంకుల్లో జమ చేయాల్సి ఉంటుంది.
ఇక.. పాత రూ.500 నోట్లు ఎక్కడెక్కడ చెల్లుతాయన్న విషయాన్ని చూస్తే..
= పౌర సేవల బిల్లుల చెల్లింపు. విద్యుత్.. నీటి బిల్లులు చెల్లించటానికి మాత్రమే అనుమతిస్తారు. ఆస్తిపన్ను చెల్లింపులకు ఈ వెసులుబాటు ఉండదు.
= డిసెంబరు 3 నుంచి 15 వరకూ టోల్ ప్లాజాల వద్ద అనుమతిస్తారు.
= పెట్రోల్ బంకులు.. శ్మశాన వాటికలు.. కోర్టు ఫీజులు
= కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల అధ్వర్యంలోని పాల కేంద్రాలు
= ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య ఖర్చుల కోసం
=వైద్యులు ఇచ్చే ప్రిస్కిప్షన్ తో మందుల షాపుల్లో మెడిసిన్స్ కొనుగోలు చేయటానికి
= ఎయిర్ పోర్టు కౌంటర్లలో.. రైల్వే టికెట్ కౌంటర్లు.. ప్రభుత్వ.. ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో నడిచే బస్సు కౌంటర్లలో
= గ్యాస్ సిలిండర్ల కొనుగోలు కోసం
= కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు.. మున్సిపాలిటీ.. స్థానిక సంస్థల స్కూళ్లలో ఒక్కో విద్యార్థి రూ.2వేల చొప్పున ఫీజుల చెల్లింపు కోసం
= రాష్ట్ర ప్రభుత్వ విక్రయ కేంద్రాల నుంచి విత్తనాలు కొనుగోలు చేసేందుకు
= మొబైల్ రీఛార్జ్ కోసం.. ఒక్కో రీఛార్జ్ కు ఒక్కో నోటు మాత్రమే తీసుకుంటారు
= వినియోగదారుల సహకార సంస్థల స్టోర్ల నుంచి రూ.5వేల వరకూ కొనుగోళ్ల మీద..
= వారానికి రూ.5వేలు చొప్పున విదేశీయులు విదేశీ కరెన్సీని మార్చుకోవచ్చు. అయితే..ఆ వివరాలు తమ పాస్ పోర్టులో విదేశీయులు నమోదు చేయించాలి
= చారిత్రక స్థలాల్లో టికెట్ల కొనుగోలుకు
= రైల్వే క్యాటరింగ్ సేవలకు.. సబర్బన్.. మెట్రో రైలు టికెట్ల కొనుగోలు కోసం
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/