Begin typing your search above and press return to search.
భార్యా భర్తల మధ్య కుటుంబాల జోక్యం వద్దు.. హైకోర్టు సంచలన ఆదేశాలు
By: Tupaki Desk | 24 July 2022 5:36 AM GMTసంసారం.. ఒక చదరంగం అంటారు. ఆ సంసారాన్ని ఈదాలంటే గజ ఈతగాళ్లు అయ్యిండాలి. లేదంటే సంసార నావ మునిగిపోతుంది. అయితే ఆలుమగల మధ్య గొడవలకు అగ్నికి ఆజ్యంపోసేది వారి ఇరువురు కుటుంబాలే . వారి మాటలు నమ్మి వీరు గొడవలు మరింతగా పెంచుకొని విడిపోతారు.
తాజాగా ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఇద్దరు వయోజనులు అయిన భార్య భర్తలు కలిసి జీవించాలని నిర్ణయించుకున్న తర్వాత వారి కుటుంబ సభ్యులతో సహా ఎవరూ జోక్యం చేసుకోవడానికి అధికారం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే వారి కుటుంబాలకు వ్యతిరేకంగా వివాహం చేసుకున్నందుకు సదురు జంటకు భద్రత కల్పించాలని ధర్మాసనం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.
కులం, సమాజంతో సంబంధం లేకుండా వివాహం జరిగినప్పుడు.. ప్రత్యేకించి తమ పౌరులను రక్షించుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉందని కోర్టు పునరుద్ఢాటించింది. వివాదానికి సంబంధించిన కేసులలో పౌరులను రక్షించడానికి ఆదేశాలు జారీ చేయడానికి అధికారం ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇద్దరు వయోజనులు భార్యాభర్తలుగా కలిసి జీవించడానికి అంగీకరించిన తర్వాత వారి కుటుంబంతో సహా థర్డ్ పార్టీ నుంచి వారి జీవితంలో జోక్యం చేసుకోరాదని ఈ మేరకు మన రాజ్యాంగం దానిని నిర్ధరిస్తుందని కోర్టు పేర్కొంది.
దేశంలోని పౌరులకు ఎలాంటి హానీ కలుగకుండా చూడడం కర్తవ్యం మాత్రమే కాదని.. దాని యంత్రాంగం, ఏజెన్సీల బాధ్యత కూడా అని హైకోర్టు తెలిపింది. పోలీసుల రక్షణ కోరుతూ ఓ వివాహిత దాఖలు చేసిన పిటీషన్ పై ధర్మాసనం శనివారం విచారణ చేపట్టింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద తాము వివాహం చేసుకున్నామని బాధితురాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. మహిళ తండ్రి ఉత్తరప్రదేశ్ లో రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి అని.. మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభాితం చేయగలడని పిటీషనర్ తరుఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలియజేశారు.
ఇక దంపతుల భద్రత రీత్యా మూడు వారాల పాటు రెండు రోజులకొకసారి దంపతుల నివాసాన్ని తనిఖీ చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. దంపతులకు బెదిరింపు, ఎమర్జెన్సీ వస్తే పోలీసులు వేగంగా స్పందించాలని కోర్టు సూచించింది.