Begin typing your search above and press return to search.

ఆ సెగ ఇక్క‌డ లేదు.. జ‌గ‌న్ వ్యూహ‌మే కార‌ణ‌మా?

By:  Tupaki Desk   |   14 Dec 2020 5:30 PM GMT
ఆ సెగ ఇక్క‌డ లేదు.. జ‌గ‌న్ వ్యూహ‌మే కార‌ణ‌మా?
X
దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో క‌నిపిస్తున్న రైతుల ఉద్య‌మ సెగ ఏపీలో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. విమ‌ర్శ ‌కులు సైతం ఈ విష‌యంలో ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఏవో కొన్న రైతు సంఘాలు ఇటీవ‌ల జ‌రిగిన బంద్‌కు మ‌ద్ద‌తివ్వాల‌ని కోరాయే త‌ప్ప‌.. ప్ర‌భుత్వంపై ఎక్క‌డా ఒత్తిడి తేలేదు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై విమ ర్శ‌లు కూడా చేయ‌లేదు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? దేశ‌వ్యాప్తంగా కేంద్రం చేసిన తాజా వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని.. మ‌ద్ద‌తు ధ‌ర‌లు క‌ల్పించాల‌ని రైతులు ఉద్య‌మిస్తున్నారు. ఏపీ విష‌యా నికి వ‌స్తే.. రైతులు కోరుతున్న డిమాండ్లు ఇక్క‌డ నెర‌వేరుతున్నాయ‌నే భావ‌న క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

గ‌తం మాట అటుంచితే.. జ‌గ‌న్ స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత రైతుల విష‌యంలో సానుకూల ధోర‌ణితోనే ముందుకు సాగుతున్న ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. రైతుల‌కు అవ‌స‌ర‌మైన విత్త‌నాలు, ఎరువులు, పురుగు మందుల విష‌యంలో న‌కిలీ బెడ‌ద‌ను తగ్గించేందుకు తీసుకున్న చ‌ర్య‌లు చాలా వ‌ర‌కు ఫ‌లించాయి.. ఇక‌, వ‌లంటీర్‌ వ్య‌వ‌స్థ‌ను సాగుకు అనుసంధానించ‌డం ద్వారా.. రైతుల స‌మ‌స్య‌ల‌ను నేరుగా తెలుసుకునే అవ‌కాశం కూడా ఏర్ప‌డింది. అదేస‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల‌కు పైగా రైతు భ‌రోసా కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డం అన్న‌దాత‌ల‌కు క‌లిసి వ‌చ్చింద‌ని అంటున్నారు.

ఇక‌, రైతుల కోసం ప్ర‌త్యేకంగా టోల్ ఫ్రీ నెంబ‌రును ఏర్పాటు చేయ‌డం.. వారి స‌మ‌స్య‌ల‌ను నేరుగా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం కూడా బాగుంద‌నే వ్యాఖ్య‌లు సీనియ‌ర్ రైతు నాయ‌కుడు వ‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌ర‌రావు ఇటీవ‌ల రాసిన ఓ వ్యాసంలో క‌నిపించాయి. మ‌రీ ముఖ్యంగా కేంద్రం ఇప్పుడు తీసుకువ‌చ్చిన రైతు చ‌ట్టాల్లోని కీల‌కమైన విష‌యం రైతులు త‌మ ఉత్ప‌త్తుల‌ను ఎక్కడైనా విక్ర‌యించుకునే వెసులు బాటు స్థానంలో.. జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన మార్పు.. బాగుంద‌ని అంటున్నారు.

అదేంటంటే.. రైతులు త‌మ ఉత్ప‌త్తుల‌ను విక్ర‌యించే స‌మ‌యంలో మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించ‌డం లేద‌ని భావిస్తే.. నేరుగా ఆ ఉత్ప‌త్తిని రైతు భ‌రోసా కేంద్రాల‌కు తీసుకువ‌స్తే.. ప్ర‌భుత్వమే మ‌ద్ద‌తు ధ‌ర‌కు కొనుగోలు చేసేలా వ్య‌వస్థ‌ను ఏర్పాటు చేయ‌డం. అదేస‌మ‌యంలో మార్కెట్‌లో పోటీత‌త్వాన్ని కూడా పెంచ‌డం వంటివి ఏపీ రైతుల‌కు క‌లిసి వ‌స్తున్న అంశాలుగా.. తాజాగా జాతీయ మీడియాలోనూ క‌థ‌నాలు రావ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన రైతు సంస్క‌ర‌ణ‌లు, ఇన్‌పుట్ స‌బ్సిడీని.. సాగు కాలానికి ముందుగానే ఇవ్వ‌డం వంటివి క‌లిసి వ‌స్తున్నాయ‌ని చెబుతున్నారు. ఈ ప‌రిణామాల కార‌ణంగానే ఏపీలో రైతులు జాతీయ ఉద్య‌మానికి దూరంగా ఉన్నార‌నే వాద‌న వినిపిస్తోంది.