Begin typing your search above and press return to search.

ఇక ఎయిడ్స్‌ పై భయం అక్కర్లేదు..!

By:  Tupaki Desk   |   6 March 2019 5:15 AM GMT
ఇక ఎయిడ్స్‌ పై భయం అక్కర్లేదు..!
X
ఎయిడ్స్.. ఈ వ్యాధి సోకితే మరణమే.. అంటు వ్యాధి కాకపోయినా ఇతరులకు విషయం తెలిస్తే మాత్రం కనీసం దగ్గరకు కూడా రానీయరు.. 'నివారణ లేదు మరణం ఒక్కటే మార్గం' అంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నా కొన్ని చోట్ల మాత్రం వ్యాధి మాత్రం విస్తరిస్తోంది. కొందరు ప్రత్యక్షంగా ఆ వ్యాధిని కొని తెచ్చుకుంటే.. మరి కొందరు ఏ పాపం చేయకుండానే వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు. అయితే కొందరు అన్యం పుణ్యం తెలియని వారు కూడా ఆ వ్యాధిబారిన పడుతున్నారు. దానిని నిర్మూలించవచ్చని కొందరు శాస్త్రవేత్తలు తాజాగా నిరూపించారు. మందులేదు అనుకున్న ఆ వ్యాధికి నయం చేసే మందును కనుగొన్న శాస్త్రవేత్తల్లో ఓ భారతీయుడు ఉండడం విశేషం.

ఎయిడ్స్‌.. ఈ పేరంటేనే జనం ప్రాణాలమీద ఆశలు వదిలిస్తారు. ఈ వ్యాధి నిర్దారణ అని తెలిస్తే చాలు.. చావు అంచుల్లోకి వెళ్లినట్లేనని భయపడుతుంటారు. అయితే ప్రస్తుతం ఈ భయం అక్కర్లేదంటున్నారు అమెరికా పరిశోధకులు. ఆ వ్యాధిపై విజయం సాధించేందుకు మనిషి సిద్ధమవుతున్నాడు. శరీరంలోని 'మూలకణ చికిత్స'పై చేసిన పరిశోధన విజయవంతం కావడంతో హెచ్‌ఐవీని నివారించవచ్చనే నిర్ధారణకు వచ్చారు. లండన్‌కు చెందిన హెచ్‌ ఐ వీ సోకిన వ్యక్తికి ఈ చికిత్స చేయగా రోగం పూర్తిగా నయమైంది. దీనికి సంబంధించిన వివరాలు పరిశోధకులు వెల్లడించారు.

లండన్‌లోని ఓ వ్యక్తి 2003లో హెచ్‌ ఐ వీ వ్యాధిబారిన పడ్డాడు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నాడు. 2016లో హెచ్‌ ఐ వీ నిరోధక శక్తి కలిగిన ఓవ్యక్తి నుంచి సేకరించిన మూల కణాలతో అతడికి మార్పిడి చేశారు. 18 నెలలుగా హెచ్‌ ఐ వీ నిరోధక మెడిసిన్‌ వాడాడు. దీంతో ఆయనకు హెచ్‌ఐవీ నుంచి విముక్తుడయ్యాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నాడని, చికిత్సకు నేతృత్వం వహించిన భారత సంతతి పరిశోధకుడు రవీంద్ర గుప్తా తెలిపారు.

*ఎలా నివారించారంటే..
కొంతమంది మనుషుల్లో 'మ్యుటేషన్లు' ఉంటాయి. అవి సీసీఆర్‌ 5 జన్యువు పనితీరును అడ్డుకుంటాయి. అంటే..ఆ మ్యుటేషన్లు కలిగిన వారి శరీరంలోకి వైరస్‌ ప్రవేశించినా ఆ మ్యుటేషన్లు దానిని నియంత్రిస్తాయన్న మాట.. రోగ నిరోధక శక్తి కలిగిన వారి నుంచి సేకరించిన మూలకణాలను సేకరించి ఎయిడ్స్ రోగుల శరీరంలోకి ప్రవేశపెట్టి రోగాన్ని నయం చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు ఇలా మూలకణాలతో చికిత్స చేస్తే ఎయిడ్స్ ను పూర్తిగా నియంత్రించవచ్చని వైద్యులు నిరూపించారు. వైద్యశాస్త్రంలోనే ఇది గొప్ప విజయం గా చెబుతున్నారు.