Begin typing your search above and press return to search.

20 కంటే ఎక్కువ వాహ‌నాలు ఉన్నాయా? నో టోల్‌!

By:  Tupaki Desk   |   1 March 2019 5:16 AM GMT
20 కంటే ఎక్కువ వాహ‌నాలు ఉన్నాయా?  నో టోల్‌!
X
త‌ర‌చూ ఓఆర్ఆర్ మీద ప్ర‌యాణించే వారికి అద్భుత‌మైన ఆఫ‌ర్ గా దీన్ని చెప్పాలి. తాజాగా ఇందుకు సంబంధించిన కీల‌క నిర్ణ‌యాన్ని హెచ్ ఎండీఏ అధికారులు తీసుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి అమ‌లులోకి రానున్న ఈ కొత్త విధానంలో టోల్ ఛార్జిల రూపురేఖ‌లు మారిపోనున్నాయి.

త్వ‌ర‌లో అమ‌లు చేయ‌నున్న కొత్త విధానంలో.. ఓఆర్ ఆర్ లోని టోల్ ఫ్లాజా వ‌ద్ద ఉండే వ‌రుస‌ల్లో ఒక వ‌రుస‌లో 20 వాహ‌నాల కంటే ఎక్కువ ఉన్న వేళ‌.. ఎలాంటి టోల్ ఛార్జిలు వ‌సూలు చేయ‌కుండా వాహ‌నాల్ని వ‌దిలేస్తారు. దీంతో.. అన‌వ‌స‌ర‌మైన ర‌ద్దీ.. ఎక్కువ సేపు వెయిటింగ్ ల‌కు చెక్ ప‌డ‌నుంది.

అదే స‌మ‌యంలో టోల్ ప్లాజా వ‌ద్ద ఏర్పాటు చేసిన వ‌రుస‌ల సంఖ్య‌ను కూడా పెద్ద ఎత్తున పెంచాల‌ని నిర్ణ‌యించారు. వ‌రుస సెల‌వులు.. పండ‌గ‌ల సంద‌ర్భంగా టోల్ ప్లాజా వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవ‌టం.. దీని కార‌ణంగా గంట‌ల కొద్దీ వెయిటింగ్ టోల్ ప్లాజాల వ‌ద్ద చేయాల్సిన ప‌రిస్థితి.

ఈ కార‌ణంగా ముఖ్య‌మైన ప‌నుల మీద వెళ్లే వారు తీవ్ర అసౌక‌ర్యానికి గురి అవుతున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు వీలుగా తాజా నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే.. ఈ నిర్ణ‌యం కేవలం అవుట‌ర్ రింగ్ రోడ్డు మీద ఉన్న టోల్ ఫ్లాజాకు మాత్ర‌మే వ‌ర్తించ‌నుంది. ఇదే విధానాన్ని మిగిలిన టోల్ ప్లాజాల‌కు వ‌ర్తిస్తే.. వాహ‌న‌దారుల‌కు మేలు చేసిన‌ట్లు అవుతారు. ప్ర‌త్యేక‌మైన దినాల్లో అని పేర్కొన్న‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం నుంచి ఆదేశాలు రాలేదంటూ వ‌సూలు చేస్తుంటారు. తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో టోల్ క‌ష్టాలు కొంత‌మేర తీర‌నున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.