Begin typing your search above and press return to search.
ఇద్దరు మాజీ ప్రధానుల రికార్డు..ఎంపీలుగా నో చాన్స్
By: Tupaki Desk | 16 Jun 2019 8:21 AM GMTసోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలు ప్రత్యేక రికార్డును సొంతం చేసుకోనున్నాయి. ఇద్దరు మాజీ ప్రధానమంత్రులు ఈ సభలో అడుగుపెట్టడం లేదు. 17వ లోక్ సభ తొలి బడ్జెట్ సమావేశాల్లో ఇద్దరు మాజీ ప్రధానులైన మన్మోహన్ సింగ్ - దేవేగౌడ పాల్గొనబోవడం లేదు. మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగియడం, దేవెగౌడ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోవడంతో వాళ్లిద్దరూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తమ వాణిని వినిపించేందుకు అవకాశం లేకుండా పోయింది. దేవేగౌడ సుమారు 20 ఏళ్ల పాటు లోక్ సభకు వరుసగా ఎన్నికవుతున్నారు. గతంలో రెండు సార్లు మాత్రమే ఓడిపోయారు. ఈమధ్యనే ముగిసిన లోక్ సభ ఎన్నికల్లో కర్నాటకలోని తుమకూరు నుంచి పోటీచేసి ఓడిపోయారు. మరోవైపు మన్మోహన్ సింగ్ 30 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం ఈ శుక్రవారంతో ముగిసింది.
ప్రముఖ ఆర్థిక వేత్త - దేశానికి 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యత్వం ఈ శుక్రవారంతో పూర్తయింది. రాజ్యసభకు ఐదుసార్లు ఎన్నికయ్యారు. అస్సాం నుంచి 1991 లో తొలిసారిగా రాజ్యసభలోకి అడుగుపెట్టిన ఆయన 30 ఏళ్లపాటు పెద్దలసభలో ఎంపీగా కొనసాగారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ కు చాలినంత బలం లేకపోవడంతో రాజ్యసభకు ఆయన ఎంపిక సాధ్యంకాలేదు. అస్సాంలో కాంగ్రెస్‌కు 25 మంది ఎమ్మెల్యేలున్నారు. 43 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంటే కాని రాజ్యసభకు ఎన్నిక కావడం అసాధ్యం.ఇతర రాష్ట్రాల్లో ఖాళీ ఉన్నా అక్కణ్నుంచి రాజ్యసభకు ఎంపికయ్యేందుకు సరిపడినంత మెజార్టీ లేకపోవడంతో మన్మోహన్ సింగ్ ను కాంగ్రెస్ ఈసారి నామినేట్ చేయలేకపోయింది.
ఇక మాజీ ప్రధాని దేవేగౌడ అనూహ్య రీతిలో పరాజయం పాలవడంతో పార్లమెంటు గడప తొక్కడం లేదు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తుమకూరు నుంచి పోటీ చేసి బీజేపీ కేండిడేట్ జీఎస్ బసవరాజ్ చేతిలో 13 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. జేడీఎస్‌కు కంచుకోటగా ఉన్న హసన్ నుంచి ఇంతకుముందు పోటీచేసిన దేవెగౌడ.. మనవడు ప్రజ్వల్ రేవన్నా కోసం ఆ సీటును వదులుకొని తుమకూరును ఎంచుకున్నారు. హసన్‌లో రేవన్నా ఘన విజయం సాధించారు. బీజేపీ కేండిడేట్ మంజును లక్షా 41 వేల ఓట్ల తేడాతో ఓడించారు. అయితే, దేవేగౌడ ఓడిపోయారు. అయితే, తన తాత కోసం హసన్ సీటుకు రాజీనామా చేస్తానని రేవన్నా ప్రకటించారు. అయితే దానికి దేవెగౌడ ఎంతమాత్రం ఒప్పుకోలేదు. ‘‘ మాజీ ప్రధానిగా నేను రెండుసార్లు ఓడిపోయాను. ఇది పెద్ద ఇష్యూ కాదు. జేడీఎస్ ను ఎలా కాపాడుకోవాలన్నదే నాకు ముఖ్యం. కిందస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే నా ముందున్న కర్తవ్యం. నా ఓటమికి ఎవర్నీ నిందించను’’ అని ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత దేవెగౌడ కామెంట్ చేశారు.