Begin typing your search above and press return to search.
నా నవ్వుకు నో జీఎస్టీ
By: Tupaki Desk | 12 Feb 2018 7:22 AM GMTతన నవ్వుకు ఎలాంటి జీఎస్టీ లేదని - నేను నవ్వాలంటే ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదంటూ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి పీఎం మోడీని ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు.
పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ పీఎం మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ‘కాంగ్రెస్ లేని భారత్ నినాదం’ తనది కాదంటూ పీఎం మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సభకు అంతరాయం కలిగించకుండా సజావుగా కొనసాగేలా చూడాలంటూ రాజ్య సభ చైర్మన్ వెంకయ్యనాయుడు వారించారు. అయినా మోదీ ప్రసంగం వింటున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుక చౌదరి బిగ్గరగా నవ్వారు. ఆ నవ్వును రామాయణం సీరియల్ లోని శూర్పణఖ పాత్రతో రేణుకా చౌదరి పోలుస్తూ పీఎం మోడీ వ్యాఖ్యలు చేశారు.
అయితే మోడీ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతుంది. పనాజిలో లింగ వివక్షపై జరిగిన ఒక సదస్సులో మాట్లాడిన రేణుకా చౌదరి మహిళలపై పీఎం మోడీ కి ఉన్న అభిప్రాయాన్ని ప్రతిబించేలా ఉన్నాయంటూ పేర్కొన్నారు. అయినా తన నవ్వుకు జీఎస్టీ లేదని - పర్మీషన్ అవసరం లేదని చెప్పుకొచ్చారు.
మోడీ తన నవ్వుపై చేసిన కామెంట్లపై మహిళలు మద్దతు పలుకుతున్నారని సూచించారు. పార్లమెంట్ చట్టాలు చేస్తుంది. కానీ మహిళలతో ఎలా ప్రవర్తించాలి. ఎలా మాట్లాడాలని చట్టసభల సభ్యులకు బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
అయిదుసార్లు ఎంపీగా గెలిచిన నాకు నవ్వడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. సాధారణంగా తాను యాదృచ్ఛికంగా నవ్వుతుంటానని, అయితే ఈసారి తాను చేతనతోనే నవ్వానని ఆమె వివరించారు.
ఇదిలా ఉంటే మోడీ వ్యాఖ్యల్ని ప్రధాన అస్త్రంగా చేసుకున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలకు సమాయత్తం అవుతుంది. మహాభారత యుద్ధంలో కౌరవుల నాశనానికి హేతువుగా నిలిచిన నిండుసభలో ద్రౌపదీ వస్త్రాపహరణంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడి దురాగతాన్ని ప్రతిబింబించే వాల్‌పోస్టర్‌ను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తద్వారా వచ్చే ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించవచ్చని కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహాలు రచయిస్తున్నారు.