Begin typing your search above and press return to search.
కేసీఆర్ అల్లం బాధ తెలంగాణకు అవసరమా?
By: Tupaki Desk | 30 Sep 2015 10:25 AM GMTఆయన తెలంగాణ రాస్ట్ర ముఖ్యమంత్రి. అయినప్పటికీ తన ఫాం హౌస్ లో రైతు అవతారం ఎత్తుతారు. దగ్గరుండి నాట్లు వేయించటం దగ్గర నుంచి.. ఏ మాత్రం ఖాళీగా ఉన్నా.. ఫాంహౌస్ కి వెళ్లి పంటను సమీక్షిస్తుంటారు. ఆయన ఎంత మోతుబరి అంటే.. ఎకరం పొలానికి ఆయన కోటి రూపాయిలు సంపాదిస్తుంటారు. ఆ విషయాన్ని ఆయనే చెప్పుకున్నారు.
అలాంటి ఆయన తన పంట పరిస్థితి గురించి తాజాగా చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన తన పాంహౌస్ పొలంలో అల్లం పంట వేశారు. ప్రస్తుతం తెలంగాణ రైతాంగం వర్షం కోసం ఆకాశం వైపు ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తిందని చెప్పిన ఆయన.. తన ఫాంహౌస్ లో పెట్టిన అల్లం కూడా పండుతుందో? లేదో? తెలియని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు.
ఓపక్క వందలాది రైతులు తమ ప్రాణాలు తీసుకుంటుంటే ఇంతవరకూ దానిపై పద్దగా స్పందించని కేసీఆర్.. తన పంటకు సంబంధించిన వేదనను మాత్రం అసెంబ్లీలో చెప్పుకున్నారు. కేసీఆర్ మాటలు చూస్తే.. యూపీఏ 1 హయాంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సతీమణి ఎప్పుడో బజారుకెళ్లి.. నిత్యవసర వస్తువల ధరలు మండిపోతున్నాయని చెబితే దేశం మొత్తం దాని గురించి వింతగా చెప్పుకుంది.
వేల మంది రైతుల బలవన్మరణాలతో ఆయా కటుంబాలు దిక్కుతోచని పరిస్థితిలో మునిగిపోతే.. వారికి మనోధైర్యం కలిగించేలా మాట్లాడే విషయంలో ఇప్పటివరకూ ఏమీ చేయని కేసీఆర్.. ఇప్పుడు మాత్రం తన పంట గురించి వేదన చెందుతున్నారు. అంటే.. ముఖ్యమంత్రి పంటకే దిక్కులేదన్న విషయాన్ని చెప్పటం ద్వారా.. సామాన్య రైతుల పరిస్థితి ఇబ్బందిగా ఉందని.. ఇదంతా ప్రకృతి ప్రకోపం అన్నట్లు కలర్ ఇవ్వటంలో కేసీఆర్ విజయం సాధించారని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే.. కేసీఆర్ అల్లం బాధ చెప్పటం ద్వారా.. తెలంగాణ రైతాంగం బాధ.. తన బాధ ఒక్కటే అన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. తన బాధను చెప్పటం ద్వారా.. తెలంగాణ రైతాంగం అనుభవిస్తున్న వేదనను తక్కువ చేయటంలో సక్సెస్ అయ్యారు.