Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రంలో హెల్మెట్ లేకుంటే పెట్రోల్ పోయరు

By:  Tupaki Desk   |   14 Jun 2016 10:30 PM GMT
ఆ రాష్ట్రంలో హెల్మెట్ లేకుంటే పెట్రోల్ పోయరు
X
ఒడిశా రాష్ట్ర రాజధాని కటక్ లోని పోలీసులు ఒక ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. ద్విచక్రవాహనాల్ని వినియోగించే వారు హెల్మెట్లు తప్పనిసరి అన్న విషయాన్ని ఎంతలా చెప్పినా ప్రజలు దాన్ని పట్టించుకోని పరిస్థితి. హెల్మెట్లు లేని కారణంగా.. రోడ్డు ప్రమాదాలు జరిగితే తీవ్ర గాయాలకు అవకాశం ఉంది. ప్రాణాలు పోయేందుకు కూడా వీలుంది. ఈ విషయం మీద ఎంత ప్రచారం చేసినా.. హెల్మెట్లు ధరించేందుకు మాత్రం పలువురు ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు పెట్టుకోని పరిస్థితి.

ఇలాంటి వైఖరికి చెక్ చెప్పాలన్న ఉద్దేశంతో కటక్ పోలీసులు వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. జూలై ఒక నుంచి హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్ కు వెళితే.. పెట్రోల్ పోయకూడదన్నది నిబంధనగా పెట్టనున్నారు. ‘నో హెల్మెట్.. నో పెట్రోల్’ పేరిట ప్రచారం చేయాలని నిర్ణయించారు. హెల్మెట్ లేకుండా వాహనం మీద రోడ్డు మీదకు వస్తే.. పెట్రోల్ కూడా దొరకదన్న సందేశం ప్రజల్లోకి వెళితే.. ఎవరు చెప్పినా.. చెప్పకున్నా అందరూ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకుంటారని కటక్ పోలీసులు భావిస్తున్నారు.

నిజానికి కటక్ పోలీసులు ఆలోచన బాగుందని చెప్పాలి. రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించటానికి ఈ నిర్ణయం ఎంతో మేలు చేయటం ఖాయం. మరి.. కటక్ పోలీసులు స్టార్ట్ చేయనున్న ఈ నిర్ణయాన్ని అందిపుచ్చుకొని.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు.. పట్టణాల్లోని పోలీసులు అమలు చేస్తే బాగుంటుంది. మరి.. ఈ చొరవ ఎవరు తీసుకుంటారు..?