Begin typing your search above and press return to search.

సత్య వాక్కు : బీజేపీ నుంచి జగన్ కి నో హెల్ప్...?

By:  Tupaki Desk   |   14 April 2022 8:40 AM GMT
సత్య వాక్కు : బీజేపీ నుంచి జగన్ కి నో హెల్ప్...?
X
ఏపీలో వైసీపీకి ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వానికి మధ్య చిక్కని బంధం ఉందని రాజకీయాల్లో ప్రచారం అవుతున్న విషయం. మూడేళ్ళుగా ఈ పాలిటిక్స్ ని గమనించిన వారికి ఇదే అర్ధమవుతుంది. ఎందుకంటే ఏపీకి ఏమీ బీజేపీ ఇవ్వకపోయినా కేంద్రాన్ని వైసీపీ అగ్ర నాయకత్వం ఎన్నడూ గట్టిగా విమర్శించినదిలేదు. ఆఖరుకు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తామన్నా కూడా పెద్దగా ప్రతిఘటించినది అయితే లేదు.

ఇక వైసీపీ ఏపీలో తనదైన శైలిలో పాలన చేస్తున్నా కేంద్రం చూసీ చూడనట్లుగా ఉంటోంది. మూడు రాజధానులు అంటూ జగన్ డేరింగ్ స్టెప్ తీసుకుంటే రాజధానులు ఎన్ని ఉండాలో రాష్ట్రం ఇష్టమని కేంద్ర బీజేపీ చెప్పేసింది. ఇక ఏపీకి అప్పులు భారీగా ఇస్తూ సాయం చేస్తోందని విపక్షాల డౌట్లు ఉన్నాయి.

ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో టీడీపీయే కేంద్ర బీజేపీ పెద్దలలకు మొదటి విలన్ అని కూడా ప్రచారంలో ఉన్న విషయం. చంద్రబాబు కంటే జగన్ తో మేలు అని కూడా వారు ఆలోచిస్తారు అని చెప్పుకుంటారు. ఇక ఈ రకమైన ప్రచారాలను పూర్వపక్షం చేస్తూ బీజేపీకి చెందిన జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తాజాగా సంచలన కామెంట్స్ చేశారు.

ఏపీలో వైసీపీకి బీజేపీ నుంచి ఏ రకమైన హెల్ప్ ఉండదని ఆయన హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఈ సత్యకుమార్ ఎవరు అంటే రాయలసీమకు చెందిన నాయకుడు. ఇటీవల యూపీలో బీజేపీ రెండవ మారు గెలవడానికి ఆ పార్టీ యోధానుయోధులతో పాటు, వ్యూహాలతో పాటు ఏపీ తరఫున సత్యకుమార్ పాత్ర కూడా ఎక్కువగానే ఉందని బయటకు వచ్చిన విషయం.

నేరుగా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సాన్నిహిత్యం కలిగి ఉన్న సత్యకుమార్ ని ఏపీ బీజేపీని బలోపేతం చేయడానికి ఉపయోగించుకుంటారని తెలుస్తోంది. అందుకే ఈ మధ్య సోము వీర్రాజు లేకుండా సత్యకుమార్ ని సన్మానించి కొందరు పార్టీ నాయకులు ఆయనే ఏపీకి దిక్కు అనేశారు.

ఇక ఏపీ బీజేపీలో ప్రో వైసీపీ, ప్రో టీడీపీ గ్రూపులు ఉన్నాయని కూడా ప్రచారం లో ఉంది. ఇపుడు సత్యకుమార్ కనుక రంగంలోకి దిగితే యాంటీ జగన్ పాలసీనే ఇక్కడ అమలు చేస్తారు అని అంటున్నారు. ఆయన పాత కొత్త కామెంట్స్ కూడా అదే నిజమని చెబుతున్నారు.

అంబేద్కర్ జయంతి వేళ సత్యకుమార్ ప్రత్యేకంగా నందిగామలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తూ కీలకమైన కామెంట్స్ చేశారు. ఏపీ రాజధాని అమరావతి మాత్రమే. ఇందులో రెండవ మాటకు తావు లేదు. కేంద్రం కూడా అమరావతి రాజధానికే నిధులు ఇస్తుంది అని ఆయన అంటున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా అమరావతిలోనే ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

అంతటితో ఆగని ఆయన వైసీపీని అవినీతిలో నుంచి పుట్టిన పార్టీగా అభివర్ణించారు. ఆ పార్టీకి బీజేపీ నుంచి ఎలాంటి సహకారం ఉండదంటే ఉండదని పక్కా క్లారిటీ ఇచ్చారు మరి సత్య వాక్కు చూస్తూంటే కేంద్ర పెద్దల వాక్కుగానే భావించాలి అంటున్నారు. సో ఫ్యూచర్ లో ఏపీలో బీజేపీ ఆపరేషన్ మొదలెడితే వైసీపీకి ముప్పే అన్న మాట అయితే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.