Begin typing your search above and press return to search.

విజ‌య‌సాయి ట్వీట్‌: హిమాల‌య వాట‌ర్ బాటిల్స్ క‌నిపించ‌వు

By:  Tupaki Desk   |   1 Jun 2019 11:22 AM GMT
విజ‌య‌సాయి ట్వీట్‌:  హిమాల‌య వాట‌ర్ బాటిల్స్ క‌నిపించ‌వు
X
ప్ర‌త్య‌ర్థి త‌ప్పుల్ని ఎత్తి చూపించ‌టం ఒక ఎత్తు.. త‌మ‌ను తాము ప్ర‌మోట్ చేసుకోవ‌టం మ‌రో ఎత్తు. ఈ విష‌యంలో బ్యాలెన్స్ ప్ర‌ద‌ర్శిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి. విప‌క్షంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు పాల‌నను డైలీ బేసిస్ లో సోష‌ల్ మీడియాలో ఏకి పారేసే ఆయ‌న‌.. తాజాగా తాము అధికారంలోకి వ‌చ్చిన వేళ‌లోనూ బాబు పాల‌న‌పైన పంచ్ లు వేయ‌టం ఆప‌లేదు.

బాబు పాల‌న‌కు.. త‌మ పాల‌న‌కు మ‌ధ్య వ్య‌త్యాసాన్ని త‌న ట్వీట్స్ తో చెబుతున్న ఆయ‌న‌.. తేడాను కొట్టొచ్చిన‌ట్లుగా చెప్పేస్తున్నారు. కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌ను రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వాడుకున్న వారంతా సిగ్గుప‌డాలంటూ.. జ‌గ‌న్ చేస్తున్న మంచి ప‌నుల జాబితాను చెప్పుకొచ్చారు.

నేను చూశాను.. నేను ఉన్నాను అంటూ పాద‌యాత్ర‌లో ఇచ్చిన మాట‌కు త‌గ్గ‌ట్లే ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కిడ్నీ బాధితుల‌కు నెల‌కురూ.10వేలు చొప్పున అస‌రా క‌ల్పించార‌న్నారు. దుబారా ఖ‌ర్చుల‌ను జ‌గ‌న్ క‌ట్ట‌డి చేసిన విష‌యాన్నిఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం సంద‌ర్భంగా స్పష్టంగా క‌నిపించింద‌న్న ఆయ‌న‌.. ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికి జ‌వాబుదారీత‌నం ఉంటుంద‌న్నారు.

ఇక‌పై హిమాల‌యా వాట‌ర్ బాటిల్స్ కనిపించ‌వంటూ ఎద్దేవా చేశారు. గ‌త ప్ర‌భుత్వంలో జ‌రిగిన దుబారా ఖ‌ర్చును ప‌రోక్షంగా ఎండ‌గ‌డుతూ తాజా విమ‌ర్శ‌లు చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న‌ప్ప‌టికీ విలాసాల ఖ‌ర్చుల్ని బాబు స‌ర్కార్ ఆప‌లేద‌న్న మాట‌ను ఆయ‌న ట్వీట్ రూపంలో చెప్పాలి. తాజాగా విజ‌య‌సాయి రెడ్డి చేసిన ట్వీట్లు చూస్తే..

+ దుబారా ఖర్చులను సిఎం జగన్ గారు కట్టడి చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇది స్పష్టంగా కనిపించింది. ప్రతి రూపాయి వ్యయానికి అకౌంటబులిటీ ఉంటుంది. హిమాలయా వాటర్ బాటిల్స్ కనిపించవిక. రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసి కూడా గత ప్రభుత్వం విలాసాలు వదులుకోలేదు.

+ జన్మభూమి కమిటీల మాఫియా రాజ్యానికి కాలం చెల్లింది. గ్రామ సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలన్నీ ప్రజల గడప వద్దకు వెళ్తాయి.చంద్రబాబు హయాంలో నేతలు వందల,వేల కోట్లు పోగేసుకున్నారు. పేదల జీవితాలు అస్థవ్యస్తమయ్యాయి. మా సిఎం వచ్చాడు. కళ్లలో పెట్టుకుని కాపడతాడనే భరోసా కనిపిస్తోందిప్పుడు.

+ వృద్ధాప్య,వితంతు,వికలాంగుల పింఛన్లను భారీగా పెంచిన రాష్ట్రంగా ఏపీ దేశంలోనే చరిత్ర సృష్టించింది. కిడ్నీబాధితుల సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నావారంతా సిగ్గు పడాలి. నేను చూసాను. నేను ఉన్నాను అంటూ నెలకు పదివేల ఆసరా కల్పించారు యువ ముఖ్యమంత్రి.