Begin typing your search above and press return to search.
రాజుకుంటున్న హిందీ వ్యతిరేక ఉద్యమం!
By: Tupaki Desk | 2 Jun 2019 1:58 PM GMTహిందీ నేర్చుకోని ప్రజలున్న రాష్ట్రాల్లో వారికి హిందీ నేర్పిస్తాం..' అంటూ కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలు దక్షిణాదిన కలకలం రేపుతూ ఉన్నాయి.ఇలాంటి మాటలతో హిందీని తప్పనిసరి చేసే ఉద్దేశంతో మోడీ సర్కార్ ఉందనే అభిప్రాయాలు ఏర్పడుతూ ఉన్నాయి. రెండోసారి ఘన విజయం అనంతరం మోడీ సర్కారు ఇలాంటి తలతిక్క పనులు చేపట్టే అవకాశాలున్నాయని విశ్లేషకులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వ్యవహారంపై వ్యతిరేకత మొదలైంది.
ఇలాంటి వ్యవహారాలకు తెలుగు వాళ్లు దూరంగానే ఉంటారు. ఆల్రెడీ మన దగ్గర హిందీ ఒక సబ్జెక్టుగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతితో మొదలుపెట్టి.. పదో తరగతి వరకూ హిందీ తప్పనిసరి సబ్జెక్టుగా కొనసాగుతూ ఉంది. పదో తరగతిలో కూడా హిందీ తప్పనిసరిగా పాస్ కావాల్సిందే!
ఇక ఇంటర్మీడియట్, డిగ్రీ లెవల్ లో కూడా హిందీ ఒక సబ్జెక్టుగా చదువుకోవచ్చు. ఆ పై చదువులు కూడా హిందీలో చదవడానికి ఏపీలో అవకాశం ఉంది.అయితే సౌత్ లో కొన్ని రాష్ట్రాల్లో హిందీ తప్పనిసరి కాదు. ప్రత్యేకించి తమిళనాట హిందీని ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే పద్ధతి లేదు.
ఈ నేపథ్యంలో బీజేపీ వాళ్లు మళ్లీ హిందీ వ్యవహారాన్ని కెళుకుతూ ఉన్నారు. హిందీని తప్పనిసరిగా చేసేలా కనిపిస్తూ ఉన్నారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ వాళ్లు అలా నోరు మెదిపారో లేదో.. సౌత్ లో రచ్చ రేగుతూ ఉంది. తప్పనిసరి హిందీని వ్యతిరకిస్తామని ఎంకే స్టాలిన్ ప్రకటించారు. డీఎంకే వాళ్లు ఈ అంశంపై రచ్చ మొదలుపెడుతున్నారు.
అలాగే కర్ణాటకలో కూడా వ్యతిరేకత ధ్వనిస్తోంది. హిందీ తప్పనిసరి అంటూ రుద్దే ప్రయత్నం చేస్తే వ్యతిరేకిస్తామని కర్ణాటక రక్షణ వేదిక అంటోంది. అక్కడి బీజేపీ వాళ్లు కూడా.. తప్పనిసరి హిందీ సబబు కాదని అంటున్నారు.