Begin typing your search above and press return to search.
తెలంగాణ జనసేనలను పవన్ ముంచేశాడట..
By: Tupaki Desk | 24 March 2019 9:54 AM ISTఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదేమరీ.. ఇప్పుడు పవన్ విధ్వేషం.. ఆక్రోషం.. తెలంగాణ జనసేన అభ్యర్థుల చావుకొచ్చింది. నిజంగా నిజమిదీ.. పవన్ కళ్యాణ్ ఏపీలోని తన ప్రచారంలో రూటు మార్చాడు. తెలంగాణపై విద్వేషం కక్కుతున్నాడు. నిన్న ఏకంగా తెలంగాణలో ఆంధ్రా వారి దాడులు జరుగుతున్నాయని.. ఇక్కడి వారి ఆస్తులు లాక్కుంటామని బెదిరిస్తున్నారని... లాక్కోవడానికి తెలంగాణ ఏమన్నా పాకిస్తానా అంటూ దారుణ వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు..
పవన్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ వాదుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలంగాణ ఏర్పడిన ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆంధ్రా వారి మీద దాడి అనేదే జరగలేదు. హైదరాబాద్ లో అన్ని రాష్ట్రాల వారు కలిసి మెలిసి ఉంటున్నారు. ఇప్పుడు పవన్ చేస్తున్న వ్యాఖ్యలు ఇరు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నాయని అంటున్నారు.
ఏపీలో రాజకీయ లబ్ధి కోసం పవన్ చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు తెలంగాణలో బరిలో నిలిచిన జనసేన అభ్యర్థుల పుట్టి ముంచుతున్నాయి. ఇప్పటికే గెలిచే అవకాశం లేకున్నా కనీసం డిపాజిట్లు తెచ్చుకొని తామేంటో నిరూపించుకుందామనుకుంటున్న తెలంగాణ జనసేన పార్లమెంట్ అభ్యర్థులు పవన్ వ్యాఖ్యలతో ఆ ఆశలు కూడా వదిలేసుకున్నారట.. కొందరైతే ఇక ప్రచారం మానేసారట.. డబ్బులు, వ్యయప్రయాసాలైనా తప్పుతాయని అస్త్రసన్యాసం చేసినట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల బరిలో పవన్ కు దగ్గరి మనిషి ఆప్తుడు అయిన జనసేన వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి కూడా పోటీచేస్తున్నారు. ఆయనిప్పుడు పవన్ వ్యాఖ్యలతో మల్కాజిగిరి పార్లమెంట్ సీటుపై ఆశలు వదిలేసుకున్నట్టు సమాచారం.