Begin typing your search above and press return to search.
యువనేత చుట్టూ క్యూ కట్టేస్తున్నారు
By: Tupaki Desk | 18 July 2016 11:54 AM GMTహార్దిక్ పటేల్...నునుగు మీసాలు కూడా సరిగా లేని ఈ యువనేత దేశ రాజకీయాల్లో ఓ సంచలనం. రాజకీయాల్లో విజేతగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్రమోడీని సైతం మూడు చెరువుల నీళ్లు తాగించిన సత్తా హార్దిక్ ది. పటేల్ సామాజికవర్గాన్ని ఓబీసీ కోటాలో చేర్చాలని హార్దిక్ చేసిన పోరాటంతో ఆయన యువనేతగా మారారు. ఈ క్రమంలోనే జైలు పాలయ్యారు. అయితే హార్దిక్ పటేల్ కు గుజరాత్ హై కోర్టు రెండు రోజల క్రితం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
వచ్చే ఏడాది గుజరాత్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు పటేళ్ళ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కు మంచి డిమాండ్ ను తెచ్చిపెట్టాయి. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆయనను తన పార్టీలోకి చేర్చుకునేందుకు ఊవ్విళ్ళూరుతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే రాయబారాలు మొదలెట్టాయి. కొన్ని పార్టీలు ఆయనను బహిరంగంగానే తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నాయి. మరి కొన్ని పార్టీలు మధ్యవర్తుల ద్వారా మంతనాలు నడుపుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ - ఎన్ సిపి - ఆమ్ ఆద్మీ పార్టీ హార్దిక్ ను తమ పార్టీలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. పటేళ్ళను ఓబిసి కోటాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించిన ఈ యువనేత మాత్రం వ్యూహాత్మక స్పందన ఇస్తున్నారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన హార్దిక్ పటేల్ కులస్తులు కోరితే తాను రాజకీయాలలో చేరతానని సూచన ప్రాయంగా తెలిపారు. రాజకీయాలలో ఉంటేనే ప్రజలకు ఏదైనా చేయగలుగుతామన్న భావన తనకు లేదన్నారు అయితే రాజకీయాలలో చేరే అవకాశాలను తోసిపుచ్చలేమన్నారు. తాను రాజకీయాలలో చేరాలా? వద్దా? అనే విషయాన్ని తన కమ్యూనిటికి చెందిన ప్రజలే నిర్ణయిస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తన కమ్యూనిటి కోరినప్పుడు రాజకీయాలలో చేరే విషయమై నిర్ణయం తీసుకుంటానన్నారు. జైలు నుంచి విడుదలైన తరువాత ఆరుమాసాల పాటు గుజరాత్ కు బయట వుండాలని కోర్టు ఆదేశించినందున ఆయన ప్రవాసంలోకి వెళ్లారు.