Begin typing your search above and press return to search.

నితీశ్ బాబును అవమానించారా?

By:  Tupaki Desk   |   20 Nov 2015 4:27 AM GMT
నితీశ్ బాబును అవమానించారా?
X
అంగరంగ వైభవంగా.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ మరోసారి ప్రమాణస్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని నితీశ్ ఆహ్వానించారు. వీరితో పాటు.. ప్రధాని మోడీ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతోపాటు.. పలువురు ప్రముఖుల్ని ఆహ్వానించారు.

ఇంతమందికి ఇన్విటేషన్ పంపినప్పటికీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం మాట వరసకు కూడా ప్రమాణస్వీకార ఇన్విటేషన్ పంపలేదని చెబుతున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు నితీశ్ కు సుపరిచితుడు. పాత స్నేహితుడు కూడా. అలాంటిది చంద్రబాబును పక్కన పెట్టటం ఆసక్తికరంగా మారింది. మోడీకి మిత్రుడిగా ఉన్నందుకు బాబును పక్కన పెట్టారా? అన్న కోణంలో ఆలోచిస్తే.. అలాంటిదే అయితే.. చంద్రబాబు మిత్రుడైన మోడీనే నితీశ్ ఆహ్వానించినప్పుడు.. చంద్రబాబును లైట్ తీసుకోవటం ఎందుకన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

బాబుకు ఇన్విటేషన్ అందకపోవటంపై ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కూడా ఆరా తీశారని చెబుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లి.. కేంద్రం చేస్తున్న విభజన తీరు సరిగా లేదంటూ మండిపడటం.. వారి సాయం కోసం ఆయా రాష్ట్రాలకు చంద్రబాబు వెళ్లటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించిన వారూ ఉన్నారు. ఊహించని విధంగా చోటు చేసుకున్న ఈ పరిణామాలకు చంద్రబాబు అప్పట్లో చాలా ఫీల్ అయినట్లుగా చెబుతారు. విభజన సమయంలో సాయం కోసం వచ్చిన చంద్రబాబును పలువురు నేతలు లైట్ తీసుకుంటే.. తాజాగా తన ప్రమాణస్వీకారానికి ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు కనీసం ఆహ్వానం కూడా పంపకపోవటం ఏమిటన్నప్రశ్నలు వినిపిస్తున్నాయి. మోడీనే పిలిచినప్పుడు.. ఆయన భాగస్వాములను కూడా పిలవాల్సిన అవసరం ఉందా? అని నితీశ్ ఏమైనా ఫీలయ్యారా ఏమిటి?