Begin typing your search above and press return to search.
దీదీకి షాకిచ్చిన కేంద్రం...నో ఇన్విటేషన్!
By: Tupaki Desk | 13 Feb 2020 3:01 PM GMTపశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి - కేంద్ర ప్రభుత్వానికి మధ్య పచ్చ గడ్డే్స్తే భగ్గుమంటుందన్న సంగతి తెలిసిందే. మోడీ సర్కార్ నియంతృత్వ పోకడలను తీవ్ర స్థాయిలో దీదీ దుయ్యబడుతుంటారు. నోట్ల రద్దు మొదలు ...సీఏఏ వరకు ...కేంద్రం తీసుకున్న నిర్ణయాలను మమత తీవ్రంగా వ్యతిరేకించారు. మమతా బెనర్జీకి - బీజేపీ నేతలకు మధ్య నిత్యం మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. గతంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా హెలికాప్టర్ ల్యాండింగ్ అనుమతి నిరాకరించిన దీదీపై కమలనాథులు గరంగరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దీదీతో మరోసారి మాటల యుద్ధానికి బీజేపీ రెడీ అయింది.`ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్` ప్రారంభోత్సవానికి దీదీని ఈశాన్య రైల్వే అధికారులు ఆహ్వానించకపోవడం వెనుక బీజేపీ హస్తముందని విమర్శలు వస్తున్నాయి.
కోల్‌కత మెట్రో రైల్వే - ఈశాన్య రైల్వే సంయుక్తంగా ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్ చేపట్టారు. తొలిదశ కింద సాల్ట్ లేక్ సెక్టార్-5 నుంచి సాల్ట్ లేక్ స్టేడియం వరకు దీన్ని నిర్మించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మమతా బెనర్జీకి ఆహ్వానం అందలేదు. ఆహ్వానపత్రంలో మమతా బెనర్జీ పేరు లేకపోవడంతో టీఎంసీ మండిపడుతోంది. కావాలనే బీజేపీ ఇలా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అటవీ, అత్యవసర సర్వీసుల శాఖ మంత్రి సుజిత్ బోస్ - బారాసాత్ ఎంపీ కకోలి ఘోష్ - బిధాన్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కృష్ణా చక్రబర్తిలను అధికారులు ఆహ్వానించి దీదీని విస్మరించడంపై నిప్పులు చెరుగుతున్నారు. తమ సీఎంను పిలవకుండా కేంద్ర ప్రభుత్వం అవమానించిందని - ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్నామని బోస్ - టీఎంసీ నేతలు చెప్పారు.
జనవరిలో అప్పటి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా హెలికాప్టర్ మాల్డా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు జిల్లా అధికారులు అనుమతి నిరాకరించారు. ఎయిర్ పోర్టు రన్ వే మీద నిర్మాణ పనుల కోసం భారీ మొత్తంలో ఇసుక - మెటీరియల్ నిల్వ చేశామని - అందుకే ల్యాండింగ్ నిరాకరించామని మమతా బెనర్జీ వివరణ ఇచ్చారు. అయితే, రన్ వే మీద ఎటువంటి మెటీరియల్ లేదని - కావాలనే మమతా బెనర్జీ....షాపై కక్ష సాధించారని బీజేపీ నేతలు ఆరోపించారు. గత ఏడాది కూడా షా హెలికాప్టర్ కు కొన్ని కారణాల వల్ల దీదీ అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మెట్రో కారిడార్ ప్రారంభోత్సవానికి దీదీని ఉద్దేశ్యపూర్వకంగానే ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా....దీదీ - మోదీల మధ్య ఉన్న గ్యాప్ ను ఈ కార్యక్రమం మరింత పెంచిదని చెప్పవచ్చు.