Begin typing your search above and press return to search.

టెకీ సతీష్ హత్య,, ఆమె కారణం కాదట..

By:  Tupaki Desk   |   3 Sep 2019 10:30 AM GMT
టెకీ సతీష్ హత్య,, ఆమె కారణం కాదట..
X
ప్రాణ స్నేహితుడైన సాఫ్ట్ వేర్ ఇంజనిర్ సతీష్ బాబునే ముక్కలుగా నరికి చంపిన హేమంత్ కేసులో కీలక నిజం వెలుగుచూసింది. మీడియాలో వార్తలు, పోలీసుల విచారణ లీకులను బట్టి అందరూ ఈ కేసులో వాళ్ల ఆఫీసులో పనిచేసే ప్రియాంక అనే అమ్మాయి కారణంగానే హత్యచోటుచేసుకున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి.

అయితే తాజాగా హేమంత్ ను హైదరాబాద్ శివారులో అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరపగా కీలక విషయాలు వెలుగుచూశాయి. సతీష్ ను తానే హతమార్చినట్టు అంగీకరించిన హేమంత్.. ఈ హత్యలో ప్రియాంకకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినట్టు సమాచారం.

అయితే హేమంత్-ప్రియాంకల మధ్య వివాహేతర సంబంధం కారణంగానే సతీష్ నిలదీయగా ఈ హ్యత చేసినట్టు వచ్చిన వార్తలను హేమంత్ ఖండించినట్టు సమాచారం. ఏడాది కాలంగా భార్యకు దూరంగా ఫ్టాల్ లో ఉన్న హేమంత్.. ప్రియాంకతో సాన్నిహిత్యం కారణంగా ఈ హత్య చోటుచేసుకుందని పోలీసులు భావించారు. అయితే సతీష్ కాల్ డేటా.. హేమంత్ సాక్ష్యాలు పరిశీలించిన తర్వాత ఈ కేసులో ప్రియాంక కారణంగానే హత్య జరగలేదని తేల్చారు. హేమంత్ కూడా ప్రియాంక కారణంగా చంపలేదని పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. అయితే ఆర్థిక కోణమా? మద్యం మత్తులో హత్య జరిగిందా అనే దానిపై ఆరాతీస్తున్నట్టు సమాచారం.