Begin typing your search above and press return to search.

ఇంకో పిల్లిమొగ్గః పాత నోట్లుంటే జైలు లేదు!

By:  Tupaki Desk   |   29 Dec 2016 2:06 PM GMT
ఇంకో పిల్లిమొగ్గః పాత నోట్లుంటే జైలు లేదు!
X
పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత విడుద‌ల అవుతున్న‌ వ‌రుస ఉత్త‌ర్వుల గంద‌ర‌గోళం ప‌రంప‌ర‌లో మ‌రో తాజా స‌మాచారం ఇది. మార్చి 31 తరువాత రద్దయిన 500 - 1000 రూపాయల నోట్లు కలిగి ఉన్న వారికి జైలు శిక్ష విధించాన‌లి కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ నిబంధనను కేంద్రం తొలగించినట్లు సమాచారం. కేవ‌లం జ‌రిమానాతోనే స‌రిపెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.ఒక వేళ ఎవరైనా పాత నోట్ల కలిగి ఉన్నా, వాటిని చెలామణి చేసేందుకు ప్రయత్నించినా కనీసం రూ. 10 వేలు జరిమాన విధించినున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్డినెన్స్ కూడా తయారు చేసింది. ఈ ఆర్డినెన్స్ రాష్ట్రపతి వద్దకు రానుంది.

పెద్దనోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకునేందుకు కేంద్రం డిసెంబర్‌ 30 వరకు గడువు విధించిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 31 తర్వాత పాతనోట్లు ఉన్నవారు రిజర్వ్‌బ్యాంకు కార్యాలయాల్లో కేవైసీ వివరాలు సమర్పించి మార్చి 31 వరకు నగదు మార్చుకునేందుకు కేంద్రం అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత పాతనోట్లు కలిగి ఉంటే మాత్రం వారిపై కఠినచర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. వీరికి నాలుగేళ్ల వరకు జైలుశిక్ష అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోందని వార్త‌లు వెలువ‌డ్డాయి. ఈ స‌మ‌యంలో కేంద్రం జైలు శిక్ష లేద‌నే నిర్ణ‌యం తీసుకోవ‌డం, అందుకోసం ఆర్డినెన్స్ ద్వారా ముంద‌కు రావ‌డం గ‌మ‌నార్హం. ఇదిలాఉండ‌గా రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ శీతాకాల విడిదిలో భాగంగా హైద‌రాబాద్‌లో విశ్రాంతిలో ఉన్న సంగ‌తి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/