Begin typing your search above and press return to search.

ఐటీలో జాబ్ సెక్యూరిటీ లేదు..నేను చ‌నిపోతున్నా

By:  Tupaki Desk   |   13 July 2017 9:30 AM GMT
ఐటీలో జాబ్ సెక్యూరిటీ లేదు..నేను చ‌నిపోతున్నా
X
క‌ల‌ల కెరీర్ అయిన ఐటీ రంగం కుదుపుల‌కు లోన‌వ‌డం టెకీల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది. ఇలా మ‌థ‌న‌ప‌డిపోతున్న యువ‌త జీవితాన్ని అర్దాంత‌రంగా ముగించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. 'ఐటీలో జాబ్ సెక్యూరిటీ లేదు.. నా త‌ల్లిదండ్రుల‌ను నేను ఎలా పోషించుకోవాలి..' అంటూ దిగులు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఆంధ్ర ప్ర‌దేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన 25 ఏళ్ల గోపి కృష్ణ ఇదివ‌ర‌కు ఢిల్లీ - హైద‌రాబాద్ లో జాబ్ చేసి రీసెంట్ గా పూణే కు షిఫ్ట్ అయ్యాడు. పూణెలోని ఓ కంపెనీ లో జాయిన్ అయిన గోపికృష్ణ కంపెనీలో జాయిన్ అయిన మూడు రోజుల‌కే హోట‌ల్ పై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

గ‌త కొద్దికాలంగా దేశంలో ఏర్ప‌డ్డ ఐటీ సంక్షోభం గోపి కృష్ణ ను మ‌నోవేద‌న‌కు గురి చేసింది. అంతే కాకుండా.. పూణే లోని చాలా ఐటీ కంపెనీలు ఉద్యోగుల‌ను తొల‌గించ‌డం తెలుసుకున్న గోపి.. త‌న భ‌విష్య‌త్తుపై భ‌యం పెంచుకున్నాడు. దీంతో.. కంపెనీ వాళ్లు ఇచ్చిన హోట‌ల్ రూమ్ లోనే క‌త్తితో త‌న మ‌ణిక‌ట్టు భాగంలో కోసుకున్నాడు. త‌ర్వాత హోట‌ల్ పైకి వెళ్లి నాలుగో అంత‌స్థు నుంచి కిందికి దూకడంతో అక్క‌డికక్క‌డే మ‌ర‌ణించాడు. బుధ‌వారం ఉద‌యం 4 గంట‌ల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు హోట‌ల్ సిబ్బంది చెబుతున్నారు. వెంట‌నే పోలీసులకు స‌మాచారం అందించ‌డంతో ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హోట‌ల్ లోని గోపి రూమ్ ను చెక్ చేయ‌గా.. ఇంగ్లీష్ లో రాసిన ఓ నోట్ దొరికింది. ఆ నోట్ లో ఐటీ సెక్టార్ లో జాబ్ సెక్యూరిటీ లేద‌ని.. త‌న‌ త‌ల్లిదండ్రుల గురించే త‌న‌నా బెంగ‌ అని.. వాళ్ల‌ను ఎలా పోషించుకోవాల‌ని లేఖ‌లో పేర్కొన్న‌ట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్ట‌మ్ అనంత‌రం త‌న గ్రామానికి గోపి మృత‌దేహాన్ని పోలీసులు త‌ర‌లించారు.