Begin typing your search above and press return to search.

ఐటీ ఢమాలేనా? ఐఐటీయన్లకే దిక్కులేదు.?

By:  Tupaki Desk   |   9 Sep 2019 5:41 AM GMT
ఐటీ ఢమాలేనా? ఐఐటీయన్లకే దిక్కులేదు.?
X
ఐఐటీల్లో చదివే విద్యార్థులు ఇన్నాల్లు హాట్ కేకులు. వారిని ఒక ఏడాది ముందే ప్రముఖ ఐటీ - టెక్నాలజీ కంపెనీలు ఎగరేసుకుపోతాయి. కోట్ల జీతాలు ఆఫర్ చేసి తన్నుకుపోతాయి. వారి ప్రతిభను జీతాలను చూసి అబ్బురపడుతాం. అలాంటి వారిని ఇప్పుడు కంపెనీలు పట్టించుకోవడం లేదు. సాఫ్ట్ వేర్ రంగంలో రిక్రూట్ మెంట్స్ బంద్, ఉన్నవారిని తీసేస్తున్న పరిస్థితి కలవరపెడుతోంది.

ఐఐటీయన్లకే దిక్కులేదు.. ఇక హైదరాబాద్ టాప్ 10 కాలేజీల్లో చదివిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాద్యం దెబ్బకు పరిశ్రమలన్నీ కుదలేవుతున్నాయి. వేల మందిని తొలగిస్తూ సంస్థను నడిపామంటే నడిపామనే తరహాలో కానిచ్చేస్తున్నాయి. ఈ ఒరవడి సాఫ్ట్ వేర్ రంగంపై కూడా పడింది. అందుకే ఇప్పుడు మాంద్యం దెబ్బకు ప్రపంచ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తొలగించే పని చేపట్టడం.. దేశంలోని ఐఐటీల నుంచి విద్యార్థులను రిక్రూట్ చేసుకోవడం తగ్గించడం సాఫ్ట్ వేరర్లను కలవరపాటుకు గురిచేస్తోంది.

ఆర్థిక మాంద్యం దెబ్బకు దేశంలోని 23ఐఐటీలు, 20 ఐఐఎంలు కుదేలయ్యాయి. వీటిల్లో చదువుకుంటున్న భారతీయ ఇంజనీర్లను తీసుకోవడానికి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలు వెనుకంజవేస్తున్నాయి. ఆర్థికమాంద్యం దెబ్బకు కంపెనీలన్నీ ఇప్పుడు ఉన్నవారినే తొలగిస్తూ కొత్త నియామకాలను ఆపేయడంతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల పరిస్థితి దారుణంగా తయారైందట..

ప్రముఖ ఐటీ - టెక్నాలజీ కంపెనీలే ఐఐటీయన్లను ఇన్నాళ్లు 70శాతం వరకు రిక్రూట్ చేసుకునేవి. కానీ ఇప్పుడు మాంద్యం దెబ్బకు పనులు లేక రిక్రూట్ మెంట్ ఆపేశాయి. నిర్వహణ భారంతో కాగ్నిజెంట్ సంస్థ ఈ అక్టోబర్ లో భారీగా ఉద్యోగులను తీసివేసేందుకు ఇప్పటికే ప్యాకేజీలు ఇచ్చి సెట్ చేసింది. రెండు నెలల్లోనే వందలాది మంది రోడ్డున పడుతున్నారు. ఇక మిగతా కంపెనీలు సీనియర్లకు ఉద్వాసన పలుకుతూ కొత్త రిక్రూట్ మెంట్లను ఆపేశాయి. దీంతో అటు ఉద్యోగాలు పోయి.. ఇటు కొత్త ఉద్యోగాలు రాక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. మాంద్యం దెబ్బ సాఫ్ట్ వేర్ రంగంపై భారీగా పడిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఐఐటీయన్లు - సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను ఆదుకునేందుకు కేంద్రం సొంతంగా స్టాటప్ లను స్థాపించాలని అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇస్తోంది. కొత్త ఆవిష్కరణలు - కంపెనీలు స్థాపించి ఐఐటీయన్లు వ్యాపారులుగా ఎదగాలని.. ఇందుకు అండగా నిలుస్తామని చెబుతోంది.