Begin typing your search above and press return to search.

కరోనా భయంతో ఘాటు ముద్దులకు చెక్ చెప్పేశారు

By:  Tupaki Desk   |   11 Feb 2020 3:30 AM GMT
కరోనా భయంతో ఘాటు ముద్దులకు చెక్ చెప్పేశారు
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావం ఆయా దేశాల మీద మామూలుగా లేదు. ఎవరికి వారు వారి స్థాయిల్లో ఏ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలో.. ఆ మేర జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి. ఇందులో భాగంగా తైవాన్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ దేశంలో నిర్మించే సినిమాలే కాదు.. సీరియల్స్ లోనూ కిస్సింగ్ సీన్ల మీద బ్యాన్ పెట్టేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

చైనాలోని వూహాన్ మహానగరం కరోనా కారణంగా ఎంతలా వణుకుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో కరోనాభయంతో తైవాన్ ప్రభుత్వం కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా టీవీ కళాకారులపై కొన్ని పరిమితుల్ని ప్రకటించింది.

సీరియల్స్ లో కిస్సింగ్ సీన్లు ఉండకూడదని.. షూటింగ్ సమయం లో కళాకారులు దగ్గరగా ఉంటూ మాట్లాడుకోకూడదని.. ఇంటిమేటెడ్ సీన్లు వద్దని చెప్పినట్లుగా చెబుతున్నారు. కరోనా డేంజర్ వేళ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి నటీనటులు.. దర్శక నిర్మాతలు సరైనవేనంటున్నారు. సో.. హాట్ హాట్ ముద్దు సీన్లకు కాస్తంత విరామం వచ్చినట్లే.