Begin typing your search above and press return to search.
చివరి కోరికను చెప్పని నిర్భయ దోషులు
By: Tupaki Desk | 24 Jan 2020 5:13 AM GMTక్షమించాలన్న మాట ఎప్పటికి వర్తించనంత దారుణమైన నేరానికి పాల్పడిన నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు ఫిబ్రవరి ఒకటి అమలు చేసేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తీహార్ జైల్లో వేర్వేరుగా ఉన్న నలుగురు దోషులకు ఉరికి ముందు తీర్చుకోవాల్సిన చివరి కోరిక ఏమైనా ఉందా? అని జైలు అధికారులు ప్రశ్నించారు.
ఉరి తీయటానికి ముందు దోషులను చివరి కోరికను అడగటం ఆనవాయితీగా వస్తున్నదే. నిర్భయ దోషులను చివరి కోరిక ఏమిటో చెబితే పరిశీలిస్తామని చెబితే.. వారు మౌనంగా ఉన్నట్లు చెబుతున్నారు. వారి సమాధానం కోసం తాము ఎదురుచూస్తున్నట్లు జైలు అధికారులు వెల్లడించారు.
అలా అని కోరిన ప్రతి కోరికను తీర్చే అవకాశం ఉండదు. ఎవరినైనా కలవటం.. మాట్లాడటం.. ఇలా కొన్ని పరిమితులకు లోబడిన కోరికల్ని మాత్రమే తీర్చే వీలుంది. నిర్భయ దోషులు నలుగురిని తమ చివరి కోరిక ఏమిటో చెప్పాలని.. రాతపూర్వకంగా తెలియజేయాలని కోరినట్లు అడిషనల్ ఇన్ స్పెక్టర్ జనరల్ రాజ్ కుమార్ వెల్లడించారు.
అయితే.. అధికారుల ప్రశ్నకు నిర్భయ దోషులు సమాధానం చెప్పని నేపథ్యంలో.. వారు ఒకట్రెండు రోజుల్లో ఏమైనా చెబుతారేమో? అని ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి జనవరి 22న వారికి విధించిన ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉన్నా.. సాంకేతిక అంశాలు.. నిబంధనలకు అనుగుణంగా వారి శిక్ష అమలు తేదీని మార్చారు. మరి.. తమ చివరి కోరికను నిర్భయ దోషులు వెల్లడిస్తారో.. ఏమీ చెప్పుకుండా ఉండిపోతారో అన్నది కాలమే తేల్చాలి.