Begin typing your search above and press return to search.
ఈ సారి ఓయూ ఉద్యమం నడిపించేది రేవంత్!
By: Tupaki Desk | 6 March 2017 5:21 PM GMTతెలంగాణలో ఉద్యమాల పురిటిగడ్డ అయిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మరో ఉద్యమానికి రెడీ అయ్యారు. ఓయూలోని 36విద్యార్ధి నిరుద్యోగ సంఘాలు తెలంగాణలో మరో పోరాటానికి శ్రీకారం చుట్టబోతున్నాయి. ఉద్యోగ నియామకాలే ఏకైక ఎజెండాగా పెట్టుకొని ఉద్యమానికి నాంది పలికేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 22న జరిగిన నిరసన ర్యాలీ కొనసాగింపుగానే... ఉద్యోగ నియామకాలపై ఉద్యమించాలని ఉస్మానియా విద్యార్ధి జేఏసీ, నిరుద్యోగుల జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణ సమావేశాన్ని నిర్వహించింది.
ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించి ఉద్యమించనున్న ఓయూ నేతలు అందులో భాగంగానే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. తమ ఆధ్వర్యంలో నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి రావాలని, ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని వారు కోరారు. ఓయూ విద్యార్ధి జేఏసీ చేపట్టిన ఆందోళనకు రేవంత్ రెడ్డి మద్దతు ప్రకటించారు. తెలంగాణ వచ్చాక యూనివర్సిటీలో పోలీసులు ఉండరని చెప్పిన కేసీఆర్... ఇప్పుడు విద్యార్థుల హాస్టళ్లలొనే పోలీస్ పహారా ఏర్పాటు చేస్తున్నాడని రేవంత్ ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి 3సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇంకా ఉద్యోగాలకు సంభందించిన ప్రకటనలు రాకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. 36విద్యార్ధి సంఘాలు తెలంగాణలో చేపట్టిన మరో పోరాటానికి రాజకీయ నాయకుడిగా నా మద్దతు ఉంటుందని ప్రకటించారు.
అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీకి వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే నెలలో జరగబోయే ఓయూ శతాబ్ది ఉత్సాల్లో సీఎం కేసీఆర్ తో సహా రాష్ట్రపతిని కూడా అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. మొత్తానికి విద్యార్థులపై పెట్టిక కేసులను అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేసిన ప్రభుత్వం వయసు అయిపోతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/