Begin typing your search above and press return to search.

కంచుకోటలో టీడీపీని లేకుండా చేసే ప్లాన్?

By:  Tupaki Desk   |   13 May 2021 11:30 PM GMT
కంచుకోటలో టీడీపీని లేకుండా చేసే ప్లాన్?
X
ఏపీలో వరుస ఎన్నికల్లో దూసుకుపోతున్న జగన్ ను కట్టడి చేయడం టీడీపీకి తలకుమించిన భారం అవుతోంది. చంద్రబాబు వృద్ధాప్యం.. లోకేష్ చపలత్వం ఆ పార్టీకి ఊపు తీసుకురావడం లేదు. క్షేత్రస్థాయిలో బలం అంచావేసుకొని నియోజకవర్గాలపై దృష్టి పెట్టకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా టీడీపీ ఓడిపోవడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది.

ముందుగా నియోజకవర్గాల్లో బలమైన నేతలను తయారు చేసుకోవడం టీడీపీకి చాలా ముఖ్యం. అదే లేకనే పోయిన సారి ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓటమి చవిచూసింది. ఇక టీడీపీకి పట్టున్న ఉత్తరాంధ్రను.. అందులో శ్రీకాకుళం జిల్లాను వైసీపీకి కోల్పోవడం పెద్ద దెబ్బగా మారింది.

ఆది నుంచి శ్రీకాకుళం జిల్లా టీడీపీకి కంచుకోట.. అందులో పలాస నియోజకవర్గంలో టీడీపీ గెలుపు ఖాయంగా ఉండేది. గౌతు ఫ్యామిలీ ఇక్కడి నుంచి పది సార్లు గెలిచింది. ఐదారు దశాబ్ధాలుగా ఈ నియోజకవర్గంలో ఆ ఫ్యామిలీకి ప్రజలు ఎంతలా పట్టం కట్టారో తెలుస్తోంది.

గత ఎన్నికల్లో గౌతు శిరిష పలాస టీడీపీ టికెట్ ఇచ్చినా గెలవలేకపోయింది. వైసీపీ ప్రభుత్వంలో ఆమె జగన్ గాలిని తట్టుకొని గెలవలేకపోయారు. దీంతో కొన్నాళ్లుగా ఆమె పార్టీకి దూరంగా ఉంటున్నారు.

ఈమె ఇన్ యాక్టివ్ గా ఉండడంతో ఇక్కడి నుంచి వైసీపీ తరుఫున గెలిచి లక్కీగా మంత్రి అయిన సీదరి అప్పల రాజు తనదైన వ్యూహంతో సాగుతున్నారు. టీడీపీ కేడర్ ను మొత్తం వైసీపీలోకి మార్చేసి ఇక్కడ బలమైన టీడీపీకి ఉనికి లేకుండా చేస్తున్నారు. గౌతు శిరిష ఫ్యామిలీ విశాఖలో ఉంటుండడంతో ఇదే అదునుగా అప్పలరాజు పలాసలో అసలు టీడీపీని లేకుండా చేస్తున్నారట..