Begin typing your search above and press return to search.

తూర్పు గోదావరి జిల్లాని వణికిస్తున్న కరోనా .. ఇప్పటివరకు 120మంది.. !

By:  Tupaki Desk   |   21 July 2020 9:10 AM GMT
తూర్పు గోదావరి జిల్లాని వణికిస్తున్న కరోనా .. ఇప్పటివరకు 120మంది.. !
X
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి పాజిటివ్ కేసులు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత నాలుగు రోజులుగా కరోనా కేసులు
నాలుగు నుండి ఐదు వేలకి పైగా నమోదు అవుతున్నాయి. దీనితో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 50 వేలు దాటింది. ఇక రాష్ట్రంలో ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లా, కర్నూల్ జిల్లాలోనే నమోదు అవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో రాష్ట్రంలోనే ఎక్కువగా 7232 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత 6604 పాజిటివ్ కేసులతో కర్నూల్ రెండో స్థానంలో ఉంది.

ఇకపొతే, తూర్పు గోదావరి జిల్లాలో వేలల్లో కరోనా బాధితులు వెలుగులోకి వస్తున్నారు. అలాగే జిల్లాలో కరోనా కారణంగా మరణించేవారి సంఖ్య కూడా పెరుగుతుంది. వృద్ధుల దగ్గర నుంచి మధ్య వయస్కుల వరకు వైరస్‌ బారిన పడి కన్నుమూస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 120 మందికి పైగా వైరస్‌ తో చనిపోయారు. ఈ జూలై నెల్లోనే 55 మంది వరకు వివిధ ఆసుపత్రుల్లో తనువు చాలించారు. ఈనెల్లో అత్యధికంగా 12వ తేదీన ఏడుగురు చనిపోయారు. జూన్‌ నెలలో కరోనా‌ మరణాల సంఖ్య తక్కువగా నమోదైనప్పటికీ జూలై రెండు నుంచి జిల్లాలో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.

ప్రతి రోజు నాలుగుకు పైగా బాధితులు కన్నుమూశారు. ప్రభుత్వం మాత్రం కరోనా‌ మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు జూన్ ‌లో ప్రతిరోజూ విడుదల చేసినకరోనా ‌ బులిటెన్‌ ల్లో మరణాల సంఖ్యను చూపించేవారు. జూలై నుంచి ఈ సంఖ్యను జాబితాలో ఏకంగా తీసేశారు. దీంతో నిత్యం కాకినాడ జీజీహెచ్‌, రాజమహేంద్రవరం జీఎస్‌ ఎల్‌, విశాఖ విమ్స్‌ లోకరోనా ‌ తో కన్నుమూస్తున్న వారి లెక్కల్లో గందరగోళం చోటుచేసుకుంటోంది. జిల్లాలో ఇప్పటివరకు వైరస్‌ తో మరణించిన వారిలో అధికంగా 60 ఏళ్లకు పైబడ్డ వారే ఉన్నారు. వయస్సురీత్యా పలు వ్యాధులతో అనారోగ్యంగా ఉండడం, ఆపై వైరస్‌ ఒంట్లో చేరడంతో అస్వస్థ తకు గురై ఆస్పత్రులకు వచ్చి చనిపోయినవారు అధికంగా ఉన్నారు.

కాకినాడ జీజీహెచ్ ‌లో ఇప్పటివరకు 59 కరోనా‌ మరణాలు నమోదయ్యాయి. ఇందులో 19 మంది కరోనా తో చేరి ఆస్పత్రిలో కన్నుమూయగా, మిగిలిన వారిలో అధికంగా అనారోగ్యానికి గురై ఆస్పత్రికి వస్తూ దారిలో మరణించిన వారున్నారు. వాస్తవానికి ఇక్కడకు కరోనా‌ చికిత్సకు వచ్చిన వారిలో 48 గంటల వ్యవధిలో ఎక్కువ మంది కన్నుమూస్తున్నారు. అప్పటికే ఒంట్లో వైరస్‌ ప్రభావంతో తీవ్ర జ్వరం, శ్వాస సమస్యలు, గుండె సంబంధిత జబ్బులు, ప్లేట్‌ లెట్స్‌ పడిపోయి పరిస్థితి విషమించిన తర్వాత చికిత్సకు వస్తుండడం ఒకరకంగా మరణాల సంఖ్య పెరగడానికి దారి తీస్తోంది. రాజానగరం జీఎస్‌ ఎల్‌ ఆసుపత్రిలో అనస్తీషియా విభాగం హెచ్ ‌వోడీ గా పనిచేస్తున్న ఆయన అదే ఆసుపత్రి లోని కరోనా చికిత్స విభాగంలోను, బొమ్మూరు క్వారంటైన్‌ సెంటర్‌ లోనూ వైద్య సేవలందిస్తూ కరోనా‌ బారిన పడి ఈనెల 18న మృతి చెందారు. అలాగే జిల్లాకి చెందిన ఓ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఇలా ఎందరో వైరస్‌ బారిన పడి తనువు చాలిస్తున్నారు. దీనిపై అధికారులు దృష్టి పెట్టాలి అలాగే జిల్లా వాసుల్లో కూడా మార్పు రావాలి.