Begin typing your search above and press return to search.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకరినొకరికి నో ఎంట్రీ

By:  Tupaki Desk   |   24 March 2020 12:10 PM GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకరినొకరికి నో ఎంట్రీ
X
ఇప్పటివరకూ ఎప్పుడూ లేని సిత్రమైన రోజుల్ని కరోనా వైరస్ తెచ్చి పెట్టింది. పేరుకు రెండు రాష్ట్రాలే అయినా.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు ఎంత ఎక్కువగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ..ఆ మాటకు వస్తే.. అందరూపడుకున్న తర్వాత.. రెండురాష్ట్రాల మధ్య ప్రయాణాలు ఎంత జోరుగా సాగుతాయన్నది వెళ్లే బస్సుల సంఖ్యను చూస్తే ఇట్టే అర్థం కాక మానదు.

కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ విస్తరిస్తున్న వేళ.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. దీంతో.. ఎవరికి వారు నివారణ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా చరిత్రలో తొలిసారి.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ సంస్థానం నుంచి ఏపీకి రాకపోకలు సాగేవి. కానీ.. అందుకు భిన్నంగా తాజాగా కరోనా పుణ్యమా అని ఏపీ ప్రజలు తెలంగాణలోకి.. తెలంగాణ ప్రజలు ఏపీలోకి రాలేని పరిస్థితి నెలకొంది.

కాస్త ఖాళీ లభిస్తే చాలు .. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా రెండురాష్ట్రాల సరిహద్దుల్ని మూసివేయటంతో.. అటు ఇటు తరచూ తిరిగే వేలాదిమంది తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. ఎప్పుడూ లేని రీతిలో ఎదురైన ఈ పరిస్థితిని జీర్ణించుకోవటం తెలుగు రాష్ట్రాల్లోని వారికి కష్టంగా ఉందని చెప్పక తప్పదు.