Begin typing your search above and press return to search.

ఆ మసీదులో అందుకు మైకు వాడరల

By:  Tupaki Desk   |   17 Jun 2016 9:45 AM GMT
ఆ మసీదులో అందుకు మైకు వాడరల
X
ప్రతి ఊర్లో ఒకటో రెండో మసీదులు కనీసం కనిపిస్తాయి. దేశం మొత్తమ్మీదా దాదాపుగా ఇలాంటి పరిస్థితే ఉంటుంది. మసీదుతో పాటు.. అందులో ప్రార్థన చేసే సమయాన్ని గుర్తు చేసేలా లౌడ్ స్పీకర్లు వాడటం అందరికి తెలిసిన విషయమే. కానీ.. దేశంలో మరెక్కడా లేని విధంగా మైకు వినియోగించని మసీదు ఒకటి ఉందని చెబుతున్నారు. అదెక్కడో కాదు.. కేరళలోని మలప్పురం జిల్లాలోని 200 ఏళ్ల నాటి జుమా మసీదులో మైకు అస్సలు వాడరట.

మైకులో వచ్చే పిలుపు (అజాం)తో ముస్లింలు నమాజ్ చేసేందుకు మసీదుకు వెళుతుంటారు. మరి.. మైకు వాడని ఈ జుమా మసీదులో నమాజ్ గురించి ఎలా పిలుపు ఇస్తారన్న సందేహం అక్కర్లేదని చెబుతున్నారు. ఎందుకంటే.. దీని కోసం దశాబ్దాల తరబడి అక్కడో అలవాటు ఉంది. అదేమంటే.. అక్కడ మైకు స్థానే నకారా (డ్రమ్స్ లాంటి వాయిద్యం) ను వినియోగిస్తారట. నమాజ్ వేళ అయిన వెంటనే పెద్ద ఎత్తున వినిపించే ఆ ఢంకానాదంతో ముస్లింలు అప్రమత్తమై నమాజ్ కు వెళతారట. దేశంలో ఎన్నో మసీదులు ఉన్నా.. ఈ మసీదులో మాత్రమే పాత పద్ధతిని ఫాలో అవుతున్నారని చెబుతారు.

ఎందుకంటే నమాజ్ కు పిలుపు కోసం ఇస్తాంలో ఈ విధానాన్ని స్టార్ట్ చేసినప్పుడు మహ్మద్ ప్రవక్త శిష్యులు నకారా.. సెమాండ్రోన్ లాంటి వాయిద్య పరికరాల్ని మోగించటం ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా చేసేవారు. కాలక్రమంలో అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించటం మొదలు పెట్టాక ఈ వాయిద్య పరికరాల స్థానే మైకు వచ్చి చేరింది. అయితే.. కేరళలోని ఆ మసీదు మాత్రం పాత సంప్రదాయాన్నే ఇప్పటికి కొనసాగించటం విశేషంగా చెప్పాలి.