Begin typing your search above and press return to search.
కొత్త సంవత్సరంలో మోడీ వారి కొత్త వాత
By: Tupaki Desk | 29 Dec 2015 4:21 AM GMTకేంద్రంలోని మోడీ సర్కారు తీరు కాస్త భిన్నమైంది. గత ప్రభుత్వాల కంటే భిన్నంగా ప్రజల మీద వాతలు పెట్టటంలో మోడీ తర్వాతే ఎవరైనా. ఇప్పటికే సేవా పన్ను పేరుతో కనిపించకుండా బాదేసిన మోడీ సర్కారు.. రైళ్లకు సంబంధించి నెల వారీగా సరికొత్త బాదుడు బాదేస్తూ.. ‘మంచి రోజులు’ (అచ్చే దిన్) అంటూ ఎన్నికల సమయంలో తాను చెప్పిన మాటకు సరికొత్త అర్థాన్ని చెబుతోంది. ఆకాశాన్ని అంటిన ధరలు నేలకు దిగలేదు. క్రూడాయిల్ రికార్డు స్థాయిలో పడిపోయినా.. దాని తాలూకూ ప్రయోజనం దేశ ప్రజలకు అందని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. ఏదో ఒక మాట చెప్పి పన్నుపోటు వేయటం ఈ మధ్యన అలవాటుగా మారింది. గీవిట్ పేరుతో.. వంటగ్యాస్ మీద సబ్సిడీని వదులుకోవటం ద్వారా.. ఆ సబ్సిడీని మరొకరికి బదిలీ అవుతుందంటూ.. టీవీల్లో భారీగా ప్రచారం చేసిన మోడీ సర్కారు.. అంతలా ప్రచారం ఎందుకు చేయాలని అనుకున్నారేమో ఏమో కానీ.. తాజాగా ఒక నిర్ణయాన్ని తీసేసుకున్నారు.
ఏడాది పన్ను ఆదాయం రూ.10లక్షలు దాటిన వారిపై కొత్త వాత వేసేందుకు సిద్ధమైంది. ఇంతకాలం పేద.. ధనిక అన్న తేడా లేకుండా సబ్సిడీ మీద అందించే వంటగ్యాస్ పై సరికొత్త నిబంధనల్ని తీసుకురానుంది. నెలకు రూ.84వేలకు పైగా జీతం ఉన్న వారికి 2016 జనవరి 1 నుంచి సబ్సిడీ మీద గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయటం బంద్ చేస్తారు. ఈ ఆదాయ వర్గాల వారు గ్యాస్ సిలిండర్ ను సబ్సిడీలు వర్తించవు. భార్యభర్తల్లో ఏ ఒక్కరి జీతం నెలకు రూ.84వేలు దాటితే ఈ నిబంధనను అమలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
పది లక్షల రూపాయిల పన్ను ఆదాయం ఉన్న వారికి గ్యాస్ సిలిండర్ పై రాయితీని రద్దు చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత ఆదాయం ఉన్న వారికి రాయితీని మినహాయించటం మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంటే.. తమకు వచ్చే ఆదాయాన్ని చూపించి పన్ను కట్టే వారి మీదనే ఇలాంటి భారం అంటూ పలువురు ట్యాక్స్ పేయర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పన్నులు కట్టే వారికి.. కట్టని వారికి మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని.. పన్నులు కట్టే వారికి అదనపు సౌకర్యం ఒక్కటి లేకపోగా.. ఇలాంటి రాయితీల నుంచి మినహాయించటం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
తమకు రాయితీని కట్ చేయటం కారణంగా తమ మీద పడే భారం పెద్ద మొత్తం కాకున్నా.. ప్రతి విషయానికి ట్యాక్స్ పేయర్ల మీద కొరడా విదులుస్తున్న ప్రభుత్వం.. బాధ్యతగా పన్ను కట్టే వారికి ఎలాంటి అదనపు సౌకర్యాలు కల్పిస్తుందన్న విషయాన్ని కూడా ఆలోచించాలని వాదిస్తున్నారు. నిజానికి ఇలాంటి వాదనల్లో కాస్తంత అర్థం ఉందనే చెప్పాలి.
ఇదిలా ఉంటే.. గ్యాస్ సిలిండర్ మార్కెట్ ధర రూ.608 అయితే.. సబ్సిడీ మీద రూ.419.26 అందిస్తున్నారు. ఏడాది 12 సిలిండర్లను సబ్సిడీ మీదా.. ఆ తర్వాత సబ్సిడీ లేకుండా పంపిణీ చేస్తున్నారు. ప్రధాని మోడీ పిలుపు తర్వాత సబ్సిడీ వద్దంటూ స్వచ్ఛందంగా వదులుకున్న వారు 57.5లక్షల మంది ఉన్నారు. తాజాగా ఆ స్థానే ప్రభుత్వం.. ఏడాదికి రూ.10లక్షల పన్ను ఆదాయం ఉన్న వారికి సబ్సిడీ కట్ చేయాలని డిసైడ్ అయ్యింది. సంపన్న వర్గాలకు.. పన్ను కట్టే వారికి రాయితీలు బంద్ చేస్తున్న ప్రభుత్వ చర్యలతో విపరీతమైన అసంతృప్తికి గురి అవుతున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు.