Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ ఒంటరిపోరు.. బాబు దారెటు?
By: Tupaki Desk | 28 Feb 2019 5:58 AM GMTతెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో టీఆర్ ఎస్ గెలిచి రెండోసారి అధికారం చేపట్టింది. ఈ ఎన్నికల్లో సందర్భంగా బీజేపీ మినహా ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి మహాకూటమిగా ఏర్పడ్డాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తో టీడీపీ - టీజేఎస్ - సీపీఐలు కలిసి రణరంగంలోకి దిగాయి. అయితే మహాకూటమిగా అధికార టీఆర్ ఎస్ కు ముచ్చెమటలు పట్టించాయి. కానీ కూటమి మొత్తం కలిసి సగం సీట్లు కూడా రాబట్టుకోలేకపోయింది.
ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత మళ్లీ మహాకూటమి ప్రస్తావన ఎక్కడా కనిపించడం లేదు. త్వరలో రాబోవు లోక్ సభ ఎన్నికల సందర్భంగా కూటమి పేరు వినబడుతోంది. ఈ ఎన్నికల్లో కూటమి పోటీ చేస్తుందా..? లేదా..? అన్న అయోమయంపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని టీపీసీసీ నేతలు నిర్ణయానికి వచ్చారు. ఇటీవల తెలంగాణకు చెందిన సీనియర్ నాయకులు రాహుల్ గాంధీతో సమావేశమై లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. దీనికి రాహుల్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.
మహాకూటమిలో భాగస్వామి పార్టీ అయిన తెలుగుదేశం పరిస్థితి ఏంటనేది ఆసక్తిగా మారింది. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు తాము ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని చంద్రబాబుకు తెలిపితే - అప్పుడు బాబు ఏ నిర్ణయం తీసుకుంటారని టీడీపీ నేతలు కూడా ఎదురుచూస్తున్నారు. ఏపీలో టీడీపీ - కాంగ్రెస్ వేర్వేరుగానే సమరానికి సై అంటున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా అదే మార్గంలో వెళ్తాయని టీడీపీ నాయకులు భావిస్తున్నారు.
ఇక టీజేఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో పోటీ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీజేఎస్ చైర్మన్ గా కోదండరాం పోటీలో నిలబడతారా..? లేదా..? అనే సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఆ పార్టీకి మంచిర్యాల నేత గుడ్ బై చెప్పారు. అయితే కొన్ని స్థానాల్లో కార్యకర్తలు టీజేఎస్ పోటీ చేయాలని కోరుతున్న నేపథ్యంలో నాలుగుస్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ నాలుగు స్థానాలేంటనేది త్వరలో నిర్ణయం తీసుకుంటారు.
జాతీయస్థాయిలో పొత్తు పెట్టుకొని తెలంగాణలో మాత్రం ఒంటరిగా వెళ్తాననడం భావ్యం కాదని కాంగ్రెస్ పై సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించిన తరువాత తమ పార్టీ ఏఏ స్థానాల్లో పోటీ చేస్తుందో ప్రకటిస్తామని సీపీఐ నేతలు అంటున్నారు.