Begin typing your search above and press return to search.

భారతీయ ఐటీకి భయం లేదు: నాస్కామ్

By:  Tupaki Desk   |   13 May 2017 7:42 AM GMT
భారతీయ ఐటీకి భయం లేదు: నాస్కామ్
X
లే ఆఫ్ ల దెబ్బకు ఆందోళన చెందుతున్న ఐటీ ఉద్యోగులకు నాస్కామ్ భరోసా మాటలు చెబుతోంది. భారతీయ ఐటి పరిశ్రమలో మూకుమ్మడి లేఆఫ్‌ల భయం లేదని అంటోంది. ఏడాదికి 1.5 లక్షల మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్న ఐటి పరిశ్రమ నికరంగా కొత్త ఉద్యోగుల నియామకాలే చేస్తుందని తెలిపింది. అయితే... ఒక్క మాదాపూర్ లోనే 4 వేల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయిన నేపథ్యంలో నాస్కామ్ మాటలు ఎలా నమ్మాలని ఐటీ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

ఐటీ సెక్టార్లో భారీగా ఉద్యోగాల కోతలుంటాయంటూ వచ్చిన వార్తలను తోసిపుచ్చుతూ ఉద్యోగుల పనితీరుపై వచ్చే నివేదికల ఆధారంగా సిబ్బందిలో సద్దుబాట్లు చేయడం అనేద ఏటా చోటు చేసుకునే ప్రక్రియేనని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఐటి రంగంలో సిబ్బంది వ్యవహారాల్లో చెప్పుకోదగ్గ మార్పు ఏదీ లేదని నాస్కామ్‌ తెలిపింది.

కాగా రానున్న కొద్ది వారాల్లో విప్రో - ఇన్ఫోసిస్‌ - టెక్‌ మహీంద్రా కంపెనీలు కాగ్నిజెంట్‌ బాటలోనే వేలాది మందికి ఉద్వాసన పలికే ఆస్కారం ఉన్నదంటూ పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తున్న వార్తల్లో నిజం ఏ మాత్రం లేదని నాస్కామ్ అంటోంది. సీనియర్ లెవల్ ఉద్యోగులకు కొంత ఇబ్బందులున్నా కొత్తవారికి ఇబ్బందేమీ ఉండదని.. అలాగే రిక్రూట్ మెంట్లకూ ఢోకా ఉండదని ఇతర ఐటీ నిపుణులు కూడా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/