Begin typing your search above and press return to search.

ఎంత మొత్తుకున్నా మారరా.. ఈ వీడియో చూస్తే మీ నోట మాట రాదంతే

By:  Tupaki Desk   |   23 May 2021 1:30 PM GMT
ఎంత మొత్తుకున్నా మారరా.. ఈ వీడియో చూస్తే మీ నోట మాట రాదంతే
X
కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆసుపత్రులు నిండిపోయి.. బెడ్లు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. కీలకమైన మందుల కొరతతో పాటు.. తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వేళ.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండటంతో పాటు కరోనాకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని తీసుకోవాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. ప్రజల్లో మార్పు రాని పరిస్థితి.

లాక్ డౌన్ వేళ అవసరం లేకున్నా వీధుల్లో తిరిగే వారి మీద చర్యలు తీసుకున్నా.. పోలీసులు లాఠీలకు పని చెబితే.. గగ్గోలు పెట్టేవారంతా.. మొదట వారు తప్పులు చేయటం ఎందుకు? పోలీసులు కొట్టారని కంప్లైంట్ చేయటం ఎందుకు? అన్నది ప్రశ్న. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు.. పన్నెండు గంటల పాటు నాన్ స్టాప్ డ్యూటీ చేసే పోలీసులు సంయమనం కోల్పోకూడదని.. వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పేటోళ్లు బోలెడంత మంది కనిపిస్తారు. కానీ.. వారి వరకు వారికి ఉండే పని ఒత్తిడితోపాటు.. రకరకాల రికమండేషన్లు.. తమ పని తాము చేసుకోనివ్వకుండా అడ్డుకునే సిఫార్సులు కూడా వారి మీద ప్రభావం చూపిస్తాయన్నది మర్చిపోకూడదు.

తామెంత కమిట్ మెంట్ తో పని చేస్తున్నా.. ఎవరో ఒకరి ఆదేశాలకు.. అధికారానికి వెనక్కి తగ్గాలన్న ఫస్ట్రేషన్ లో.. కొందరి విషయంలో తప్పుగా వ్యవహరించొచ్చు. దీనికి కారణం కూడా ప్రజలే అన్నది మర్చిపోకూడదు. ఇదంతా ఎందుకంటే.. ఇంత భారీగా కేసులు నమోదై.. లక్షలాది మంది బాధ పడుతున్న వేళ.. రాంనగర్ ఫిష్ మార్కెట్లో.. సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో ఆదివారం ఉదయం పది గంటలు దాటిన తర్వాత నెలకొన్న రద్దీ చూస్తే.. ఆదివారం చేపలు తినకపోతే చచ్చిపోతారా? అన్న భావన కలుగక మానదు. ప్రజలు ఇంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తారా అన్న కోపం రావటం ఖాయం.